కోలీవుడ్ పాలిటిక్స్: విశాల్ కు మరో షాక్!

Published : Jul 09, 2019, 10:28 AM IST
కోలీవుడ్ పాలిటిక్స్: విశాల్ కు మరో షాక్!

సారాంశం

  మొన్నటివరకు కలిసిమెలిసి ఉన్న కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు వర్గపోరు డోస్ ఎక్కువైంది. విశాల్ ఏ పని చేసినా ఫలితం దక్కడం లేదు. అసలే కోర్టు సమస్యలతో సతమతమవుతున్న విశాల్ కి ఎలక్షన్స్ రిజల్ట్ మరింత టెన్షన్ గా మారింది.

మొన్నటివరకు కలిసిమెలిసి ఉన్న కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు వర్గపోరు డోస్ ఎక్కువైంది. విశాల్ ఏ పని చేసినా ఫలితం దక్కడం లేదు. అసలే కోర్టు సమస్యలతో సతమతమవుతున్న విశాల్ కి ఎలక్షన్స్ రిజల్ట్ మరింత టెన్షన్ గా మారింది. చెన్నై హై కోర్టు నడిఘర్ ఎలక్షన్స్  రిజల్ట్ కి మరోసారి బ్రేక్ వేసింది. 

నిరంతర వివాదాలతో జరిగిన ఎలక్షన్స్ కి కోర్టు షరతులతో కూడిన అనుమతిని ఇవ్వగా సోమవారం రిజల్ట్ రావాల్సి ఉంది. కోలీవుడ్ నడిఘర్ సంఘం అధ్యక్ష్య పదవి ఎవరిని వరిస్తుంధో అని అంతా ఎదురుచూస్తుండగా సడన్ గా హై కోర్టు బ్రేక్ వేసింది. న్యాయ స్థానం నుంచి ఆదేశాలు వెలువడేంత వరకు ఓట్ల లెక్కింపు జరగకూడదని కోర్టు తెలిపింది. 

చెన్నై కోర్టులో విశాల్ ఇటీవల  ఓట్ల లెక్కింపు కోసం వేసిన పిటిషన్ వృధా అయ్యింది. ఇప్పట్లో నడిఘర్ భవితవ్యం గురించి క్లారిటీ వచ్చేలా లేదు. అలాగే ఈ ఎన్నికల వాయిదా కూడా ఇండస్ట్రీలో అంతర్గత విబేధాలను మరింత పెంచుతున్నట్లు సమాచారం.  

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..