‘ఆర్ఆర్ఆర్’ ఖాతాలోకి మరో అవార్డు.. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంఎం కీరవాణి!

By team teluguFirst Published Dec 12, 2022, 12:27 PM IST
Highlights

‘ఆర్ఆర్ఆర్’ క్రియేట్ సెన్సేషన్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు అవార్డుల పంటనూ కొనసాగిస్తోంది.  తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ ఖాతాలో మరో అవార్డు వచ్చి చేరింది.
 

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajmouli) తెరకెక్కించిన బ్లాక్ బ్లాస్టర్ ఫిల్మ్  ‘ఆర్ఆర్ఆర్’కు  ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్ నుంచి కూడా చిత్రానికి గుర్తింపు దక్కింది. ఇప్పటికే 2023 ఆస్కార్ బరిలోనూ చిత్రం నిలిచింది. మరోవైపు తనదైన దర్శకత్వంతో తెలుగు సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గౌరవం దక్కేలా చేశారు రాజమౌళి. దీంతో రీసెంట్ గా రాజమౌళికి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్‌లో ఉత్తమ దర్శకుడిగా అవార్డును దక్కించుకున్నారు. కాస్ట్ అండ్ క్రూకి కూడా హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ (HCA) నుంచి అవార్డును సొంతం చేసుకుంది.

ఇక తాజాగా మరో అవార్డు కూడా ఆర్ఆర్ఆర్ ఖాతాలో వచ్చి చేరింది. అమెరికాకు చెందిన లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్ ను దక్కించుకుంది. బెస్ట్ మ్యూజిక్ కేటగిరీ 2022కి గాను ఎంఎం కీరవాణి ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు దక్కించుకున్నారు. మరోవైపు ఉత్తమ దర్శకుడిగానూ ఎస్ఎస్ రాజమౌళి ఫస్ట్ రన్నరప్ గా నిలిచాడు. రెండు విభాగాలకు సంబంధించిన అవార్డులు RRR చిత్రానికి దక్కడం పట్ల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ లోని కొమురం భీముడో, నాటు నాటు సాంగ్స్ ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. 

రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం వరుస అవార్డులను కొల్లగొడుతూ తెలుగు సినిమా సత్తాను చాటుతోంది. మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఇతర దేశాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ భారీ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరన్ కీలక పాత్రల్లో నటించారు. డీవీవీ దానయ్య సొంత బ్యానర్ పై నిర్మించారు. 

Best Director, Runner-up: S.S. Rajamouli

— Los Angeles Film Critics Association (@LAFilmCritics)
click me!