ఇండియన్ సూపర్ హీరోకే గూస్ బంప్స్ తెప్పించిన 'కాంతారా'.. హృతిక్ రోషన్ మైండ్ బ్లాక్ అయ్యిందిగా

Published : Dec 12, 2022, 11:03 AM ISTUpdated : Dec 12, 2022, 11:07 AM IST
ఇండియన్ సూపర్ హీరోకే గూస్ బంప్స్ తెప్పించిన 'కాంతారా'.. హృతిక్ రోషన్ మైండ్ బ్లాక్ అయ్యిందిగా

సారాంశం

రిషబ్ శెట్టి ఓవర్ నైట్ లో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతారా  మాట్లాడుకునే సంచలన విజయం నమోదు చేసింది. 

రిషబ్ శెట్టి ఓవర్ నైట్ లో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతారా  మాట్లాడుకునే సంచలన విజయం నమోదు చేసింది. 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 350 కోట్ల వసూళ్లు రాబట్టింది అంటే ఆ ప్రభంజనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 

ఇప్పుడు ఎక్కడ చూసినా కాంతారా మాటే వినిపిస్తోంది. రిషబ్ శెట్టి ఈ చిత్రాన్ని కర్ణాటకలోని తుళు సంప్రదాయం ఆధారంగా తెరకెక్కించారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి నటన అద్భుతం. ఇండియాలో ఉన్న టాప్ సెలెబ్రిటీలు కాంతారా చిత్రానికి ఫిదా అవుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, రాజమౌళి, ఇతర స్టార్ హీరోలు కాంతారా చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

తాజాగా ఇండియన్ సూపర్ హీరో హృతిక్ రోషన్ కాంతారా చిత్రం వీక్షించాడు. అనంతరం ట్విట్టర్ లో ఈ చిత్రం గురించి ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశాడు. 'కాంతారా చిత్రం చూడడం ద్వారా చాలా నేర్చుకున్నా. హీరో రిషబ్ శెట్టి శక్తి సామర్థ్యాలు, కన్విక్షన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా మార్చాయి. కథ చెప్పిన విధానం, నటన, దర్శకత్వం అద్భుతంగా ఉన్నాయి. 

క్లైమాక్స్ లో కథ ఒక్కసారిగా మలుపు తిరిగిన విధానం నాకు గూస్ బంప్స్ తెప్పించింది. చిత్ర యూనిట్ కి నా అభినందనలు అంటూ హృతిక్ రోషన్ ట్వీట్ చేశారు. హృతిక్ ట్వీట్ కి రిషబ్ శెట్టి థాంక్యూ సర్ అంటూ రిప్లై ఇచ్చాడు. 

 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?