“యానిమల్” పై RGV కామెంట్స్, కంగారుపడ్డ ఫ్యాన్స్

Published : Mar 31, 2023, 09:54 AM IST
 “యానిమల్” పై RGV కామెంట్స్, కంగారుపడ్డ ఫ్యాన్స్

సారాంశం

 ఇప్పటికే సినిమా పై మంచి హైప్ ఉండగా, ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు మరింత ఆసక్తి నెలకొంది. అయితే వర్మ గత కొంత కాలంగా డిజాస్టర్స్ ఇస్తున్నారు. 


సందీప్ రెడ్డి వంగా నుంచి వస్తోన్న మూడో సినిమా ‘యానిమల్’ (Animal). బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా నటిస్తోన్న ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలున్నాయి. జనవరిలో విడుదలైన ‘యానిమల్’ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ‘యానిమల్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రణ్‌బీర్ కపూర్ లుక్ అందరినీ షాక్‌కు గురిచేసింది. ఒళ్లంతా రక్తం, సంకలో రక్తంతో తడిసిన గొడ్డలి పెట్టుకుని సిగరెట్ వెలిగించుకుంటున్న రణ్‌బీర్ లుక్ చూసి కొందరు భయపడ్డారు. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనంత వైల్డ్‌గా రణ్‌బీర్ ఈ పోస్టర్‌లో కనిపించారు. సినిమా ఎలా ఉండబోతోందో ఈ ఒక్క పోస్టర్‌తో చెప్పేశారు దర్శకుడు సందీప్ వంగా. తాజాగా ఈ చిత్రం గురించి వర్మ మాట్లాడారు. 
 
రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ... యానిమల్ సినిమా అనేది అన్ని గ్యాంగ్స్టర్ చిత్రాలకి బాప్ అవుతుంది అని అన్నారు. సందీప్ నాతో స్టొరీ డిస్కస్ చేశారు. కొన్ని సలహాలు ఇచ్చాను అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికే సినిమా పై మంచి హైప్ ఉండగా, ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు మరింత ఆసక్తి నెలకొంది. అయితే వర్మ గత కొంత కాలంగా డిజాస్టర్స్ ఇస్తున్నారు. దాంతో ఆయన ఇప్పుడు ఈ సినిమాకు సలహాలు ఇచ్చారు అనగానే హీరో ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. సందీప్ ని ట్యాగ్ చేస్తూ ...ఆయన సలహాలు తీసుకుని మా హీరో సినిమా పాడు చేయద్దు అంటూ రిక్వెస్ట్ లు చేస్తున్నారు.
 
ఇక సందీప్ స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడే హీరో రణ్‌బీర్ కపూర్ భయపడ్డారట. ఈ విషయాన్ని ఆయన  ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘యానిమల్ స్క్రిప్ట్ మొదటిసారి విన్నప్పుడు.. నాకు ఇంకా గుర్తుంది.. డైరెక్టర్ సందీప్ స్క్రిప్ట్ నెరేట్ చేయడం పూర్తికాగానే నేను నా బాత్‌రూంలోకి వెళ్లాను. నన్ను నేను అద్దంలో చూసుకున్నాను. చాలా భయపడ్డాను. ఒక స్టోరీ, ఒక పాత్ర గురించి విని నేను భయపడటం ఇదే తొలిసారి. సినిమా చాలా బాగా వస్తోంది. సందీప్‌తో పనిచేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఇదొక క్రూరమైన గ్యాంగ్‌స్టర్ డ్రామా. తండ్రీకొడుకుల ప్రేమకథ. ఆగస్టు 11న ఈ సినిమా విడుదలవుతోంది. ’ అని రణ్‌బీర్ కపూర్ వెల్లడించారు.

మొత్తానికి సందీప్ రెడ్డి వంగా చాలా గ్యాప్ తరవాత తెలుగు ప్రేక్షకులతో పాటు అన్ని భాషల ఆడియన్స్‌కు మరో ఆసక్తికర సబ్జెక్ట్‌తో కిక్ ఇవ్వబోతున్నారు. అయితే, ‘యానిమల్’ కథను మొదట సూపర్ స్టార్ మహేష్ బాబుకు సందీప్ చెప్పారట. అప్పుడు ‘డెవిల్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కానీ, మహేష్ బాబు ఈ సినిమా చేయడానికి అంగీకరించకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ను రణ్‌బీర్ దగ్గరకు తీసుకెళ్లారు సందీప్. ఈ సినిమాను రణ్‌బీర్ చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్టున్నారు. ఈ సినిమాలో అనిల్ కపూర్, రష్మిక మందన ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Highest Remuneration: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్ల పారితోషికాలు.. అత్యధికంగా తీసుకునేది ఎవరంటే?
బాలయ్యతో చేసిన ఆ సినిమా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ హీరోయిన్