'చరణ్ కాదన్నా గ్లోబుల్ స్టార్ నువ్వే' మంచు విష్ణుపై సెటైర్లు! మళ్లీ ఏం చేసాడంటే..

By Surya PrakashFirst Published Mar 31, 2023, 9:37 AM IST
Highlights

ట్రోలర్స్‌ ఆకలితో ఉన్నారు.. ఆడేసుకుంటారు. నీ ఫ్యాన్‌గా చెబుతున్నా.. ఇలాంటివి వద్దు.. ఇంక నీ యిష్టం. 

మంచు మోహన్ బాబు కుటుంబంలో  కొన్నాళ్లుగా విభేదాలు ఉన్నాయనే వార్త చాలాకాలంగా మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై డిస్కషన్స్, ట్రోలింగ్స్ తెగ జరుగుతున్నాయి. రీసెంట్ గా మంచు మనోజ్‌   సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఓ వీడియో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. మంచు కుటుంబంలో ఎంతోకాలంగా పని చేస్తున్న సారథి ఇంట్లోకి చొరబడి అతనిపై విష్ణు చేయి చేసుకున్న వీడియో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ వీడియో సోషల్‌ మీడియా నుంచి తొలగించారు.

 అయితే నిజంగానే వీళ్ల మధ్యన విభేధాలు ఉన్నాయా లేక నటిస్తున్నారా అనేది కూడా కొందరు అనుమానం వ్యక్తం చేసారు. అయితే ఇప్పుడు మంచు విష్ణు అదే వీడియోను ప్రస్తావిస్తూ మరో వీడియో  ను రిలీజ్‌ చేశారు. ఆ వీడియోలో మంచు విష్ణు  చేస్తున్న ఓ రియాలిటీ షోకు సంబంధించిన కంటెంట్‌ ఉంది. దీనికి ‘హౌస్‌ ఆఫ్‌ మంచూస్‌’  అని పేరు చేశారు. త్వరలోనే ఇది ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల మనోజ్‌ పోస్ట్‌ చేసిన వీడియో కూడా దీనిలో భాగమే అని తెలుస్తోంది.అయితే ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.


ఈ వీడియోలో మంచు కుటుంబం ఇంటిని, కుటుంబ సభ్యులు మాట్లాడుకోవడాన్ని చూడొచ్చు. ‘ఇదొక రియాలిటీ షోకు సంబంధించింది’ అనే అర్థం వచ్చేలా వీడియోను ముగించారు.   ఇంక మంచు అన్నదమ్ములు పోస్ట్‌ చేసిన వీడియోలను కొందరు సరదాగా తీసుకున్నా.. కొందరైతే మండిపడుతున్నారు. ‘ఆడుకోవడానికి మేమే దొరికారా?మమ్మల్ని ఫూల్స్‌ చేస్తారా’ అంటున్నారు. మరికొందరు.. ఎందుకన్నా ఇవన్నీ... అసలే ట్రోలర్స్‌ ఆకలితో ఉన్నారు.. ఆడేసుకుంటారు. నీ ఫ్యాన్‌గా చెబుతున్నా.. ఇలాంటివి వద్దు.. ఇంక నీ యిష్టం. లేదంటే ట్రోలర్స్‌కి బిర్యాని అయిపోతావ్‌’’ అని  పోస్ట్‌ చేశారు. 

ఇవన్ని ఒకెత్తు అయితే నువ్వు తోపున్నా ..నీ ఐడియా సూపర్ అన్నా అని వీడియో క్రింద కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అయితే రామ్ చరణ్ కాదు గ్లోబుల్ స్టార్ ..నువ్వే అంటూ వెటకారం చేస్తున్నారు. ఇక ‘మీ మధ్య ఎన్ని ఉన్నా.. ఈ వయసులో పెద్దయనను ఇబ్బంది పెట్టొద్దు’’ అని మరో నెటిజన్‌ ట్వీట్‌ చేశారు. జరిగిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇదంతా డ్రామా అంటూ మండిపడుతున్నారు. ఇకనైనా నెటిజన్స్‌తో సిల్లీగా ప్రవర్తించవద్దంటూ దుయ్యబడుతున్నారు.
 

click me!