'ఎఫ్ 2' డైరెక్టర్.. రూ.9 కోట్లకు ఫిక్స్!

Published : Apr 13, 2019, 03:07 PM IST
'ఎఫ్ 2' డైరెక్టర్.. రూ.9 కోట్లకు ఫిక్స్!

సారాంశం

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి ఫేం వస్తుందో చెప్పలేం.. ఒక్క సినిమా హిట్ అయితే ఎనలేని గుర్తింపు వచ్చేస్తుంది. అదే సక్సెస్ కంటిన్యూ అయితే టాప్ ప్లేస్ లో ఉంటారు. 

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి ఫేం వస్తుందో చెప్పలేం.. ఒక్క సినిమా హిట్ అయితే ఎనలేని గుర్తింపు వచ్చేస్తుంది. అదే సక్సెస్ కంటిన్యూ అయితే టాప్ ప్లేస్ లో ఉంటారు. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఇప్పుడు టాప్ ప్లేస్ కూర్చోవడానికి కొంచెం దూరంలోనే ఉన్నారు. 

వరుసగా నాలుగు సినిమాలు సక్సెస్ ల తరువాత మహేష్ బాబుని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు ఈ కుర్ర దర్శకుడు. అయితే మహేష్ సినిమా కోసం ఈ దర్శకుడు అందుకున్న పేచెక్ ఎంతో తెలుసా..? అక్షరాలా రూ.9 కోట్లు.ఇటీవలే నిర్మాతలు అతడిని కలిసి అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అనీల్ రావిపూడి కెరీర్ లో ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకోవడం ఇదే తొలిసారి.

నిజానికి ఈ డైరెక్టర్ కి ఒక్కో సినిమాకి మూడు నుండి నాలుగు కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేవారు. ఇప్పుడు దానికి డబుల్ చేసి ఇవ్వడం విశేషమనే చెప్పాలి. టాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్, త్రివిక్రమ్, కొరటాల శివ వంటి దర్శకులు ఒక్కో సినిమాకి 13 నుండి 14 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

ఇప్పుడు మహేష్ సినిమా కూడా హిట్ అయితే అనీల్ రావిపూడి కూడా ఈ టాప్ దర్శకుల లిస్ట్ లోకి చేరడం ఖాయమంటున్నారు. త్వరలోనే మహేష్ - అనీల్ ల సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా తరువాత అనీల్ రావిపూడి.. నిర్మాత సాహు గారపాటితో మరో సినిమా చేయనున్నాడు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా