ఈసారి కనిపిస్తే చెంప పగలగొడతా.. చిన్మయి కామెంట్స్!

Published : Apr 13, 2019, 02:07 PM IST
ఈసారి కనిపిస్తే చెంప పగలగొడతా.. చిన్మయి కామెంట్స్!

సారాంశం

'మీటూ' ఉద్యమంలో భాగంగా సింగర్ చిన్మయి.. ప్రముఖ గీత రచయిత వైరముత్తుపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 

'మీటూ' ఉద్యమంలో భాగంగా సింగర్ చిన్మయి.. ప్రముఖ గీత రచయిత వైరముత్తుపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పదేళ్ల క్రితం వైరముత్తు తనను లైంగికంగా వేధించాడని ఆమె మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

అయితే ఈ విషయంలో కొందరు చిన్మయికి మద్దతుగా నిలిస్తే.. కొందరు మాత్రం ఆమెపై విమర్శలు చేశారు. చిన్మయి మాత్రం సందర్భం దొరికిన ప్రతీసారి వైరముత్తుపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉంది. తాజాగా మరోసారి అతడిపై విరుచుకుపడింది. 

''ఈసారి వైరముత్తు కనిపిస్తే చెంప చెల్లుమనిపిస్తా'' అంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పింది చిన్మయి. ఈరకంగా చిన్మయి కామెంట్ చేయడానికి ఓ కారణం ఉంది. రీసెంట్ గా నటి ఖుష్బూ తనతో అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి చెంప చెల్లుమనిపించింది.

ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. ఇదే విషయాన్ని చిన్మయితో చాట్ చేసిన నెటిజన్ ప్రస్తావనకు తీసుకురాగా.. చిన్మయి.. 'వైరముత్తు కనిపిస్తే ఈసారి కచ్చితంగా చెంప చెల్లుమనిపిస్తా.. అలా అయితేనే నాకు న్యాయం జరుగుతుందేమో' అని పేర్కొంది. దీంతో మరోసారి చిన్మయి వార్తల్లో నిలిచింది. 

PREV
click me!

Recommended Stories

Rithu Chowdary: అంతా నా కర్మ, మోసం చేసి మరో అమ్మాయితో వెళ్ళిపోయాడు.. కెరీర్ కోసమే నవ్వుతూ బతుకుతున్నా
Parthiban Controversy:చిక్కుల్లో పడ్డ ఉస్తాద్ విలన్.. పవన్ కళ్యాణ్ ముందే అలాంటి వ్యాఖ్యలు, వైరల్