
మాటల రచయితగా టాలీవుడ్ లో తన ప్రస్తానం స్టార్ట్ చేసి.. డైరెక్టర్ గా ప్రమోషన్ సాధించాడు అనిల్ రావిపూడి. పటాస్ తో సూపర్ సక్సెస్ అందుకుని.. మహేష్ ను డైరక్ట్ చేసే స్థాయికి ఎదిగాడు. ఎఫ్2,ఎఫ్3 సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ మనసు దోచిన ఈ దర్శకుడు.. తనలోని మల్టీ టాలెంట్ ను చూపిస్తూ.. ఆకర్షిస్తున్నాడు. అదరిపోయే స్టెప్పులేయడం, భారీ బడ్జెట్ సినిమాల స్టార్లను ఇంటర్వ్యూ చేయడం, షూటింగ్ స్పాట్ లో డాన్సులేయడం.. రీల్స్ చేయడం లాంటివి బాగా చేస్తుంటాడు అనిల్. డైరెక్టర్లలో తాను స్పెషల్ అనిపించకుంటుననాడు
ప్రస్తుతం అనిల్ రావిపూడి బాలయ్య హీరోగా ఆయన 108 మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈమూవీ షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు దర్శకుడు. అందులో భాగంగా తాజాగా యాక్షన్ సీక్వెన్స్ లు కంప్లీట్ చేశారు. ఇందుకు సింబాలిక్ గా ఓ రీల్ చేసి.. చూపించాడు అనిల్ రావిపూడి. ఫైట్ మాస్టర్ తో పని అయిపోయింది.. ఇక డాన్స్ మాస్టర్ తోనే పని అంటూ.. ఓ రీల్ చేశాడు అనిల్ రావిపూడి.. ఇందులో భాగంగా.. బాలయ్య లారీ డ్రైవర్ సినిమాలో పాటకు అదరిపోయే స్టెప్పులు వేశాడు అనిల్. అంతే కాదు ఈసినిమాకు లారీ డ్రైవర్ కు లింక్ ఉందని హింట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి.
ఎఫ్ -3 సినిమా సమయంలో కుర్రాడు బాబోయ్ సాంగ్ కు హీరోలతో కలిసి అదిరిపోయే స్టెప్పులేసి వావ్ అనిపించాడు. ఇప్పుడు మరో సారి డ్యాన్స్ చేసి ఆయనలో హీరోలకు ఏమాత్రం తీసుపోడని నిరూపించాడు. ‘నట్టు లూజు దానా బాలయ్య, బాలయ్య..ఫిట్టు చేయరానా’ అంటూ లారీ డ్రైవర్ సినిమాలోని పాటకు డ్యాన్సులు చేశారు. ఇందులో ఇప్పటికే ఫైట్స్ ముగిసినట్లు తెలుస్తోంది. ఇక పాటలపై కసర్తుతులు మొదలు పెడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ రీల్ వీడియో తెగ వైరల్ అవుతుంది. దీనికి నెటిజన్ల నుండి కామెంట్లు వస్తున్నాయి. మీరు హీరోగా ట్రై చేయొచ్చు కదా.. మీరు మంచి డైరెక్టరే కాదూ.. మంచి డ్యాన్సర్ కూడా అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఇక బాలయ్య సినిమాను సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. కాజల్అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల బాలయ్య కూతురుగా నటిస్తుంది. ఇక బాలయ్య ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈమూవీలో తమన్నాతో అదిరిపోయే ఐటమ్ సాంగ్ చేయించబోతున్నారు.