వైఎస్ రాజారెడ్డి గెటప్ లో జగపతి బాబు!

Published : Jan 03, 2019, 12:02 PM IST
వైఎస్ రాజారెడ్డి గెటప్ లో జగపతి బాబు!

సారాంశం

మాజీ ముఖ్యమంత్రి.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ను 'యాత్ర' పేరుతో తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ‌. మలయాళ సూప‌ర్ స్టార్ మమ్ముట్టి ఇందులో వైఎస్ పాత్ర చేస్తున్నాడు.

మాజీ ముఖ్యమంత్రి.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ను 'యాత్ర' పేరుతో తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ‌. మలయాళ సూప‌ర్ స్టార్ మమ్ముట్టి ఇందులో వైఎస్ పాత్ర చేస్తున్నాడు.

ఇక ఈ మూవీలో రావు రమేష్, పోసాని కృష్ణమురళి, అనసూయ లాంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తుండగా.. వై ఎస్ ఆర్ తండ్రి రాజారెడ్డి పాత్ర కోసం జ‌గ‌ప‌తి బాబుని తీసుకున్నారు. ఫ్యాక్షనిస్టుగా గుర్తింపున్న రాజా రెడ్డి గురించి పులివెందులలో కథలు కథలుగా చెప్పుకుంటారు. 

ఆయనలో మంచి-చెడు రెండు కోణాలు ఉన్నాయి. ఈ పాత్రలో జగపతి బాబు ఎలా ఉంటాడనే విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. రాజారెడ్డిగా జగపతి బాబు గెటప్ బయటకొచ్చింది. ఖద్దర్ చొక్కా, కోరమీసంతో ఉన్న జగపతి బాబు లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.

విజయ్ చిల్ల, శశి దేవిరెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. 

 

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు