
వరుస విజయాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు మహేష్. ఆయన గత చిత్రాలు భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు భారీ విజయాలు అందుకున్నాయి. ఈ నేపథ్యంలో లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాటపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. గీత గోవిందం మూవీతో యూత్ ని మెస్మరైజ్ చేసిన దర్శకుడు పరుశురామ్ సర్కారు వారి పాట మూవీ తెరకెక్కిస్తుండగా... మహేష్ లుక్ అదిరిపోయింది. పెరిగిన జుట్టు, లైట్ చిన్ తో మహేష్ మాస్ అటైర్ కట్టిపడేస్తుంది.
ఇక సర్కారు వారి పాట అప్డేట్(arkaru Vaari Paata update) కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా సంక్రాంతి కానుకగా అప్డేట్ రానున్నట్లు ప్రచారం జరిగింది. మూవీ యూనిట్ సైతం దీనిపై కసరత్తు చేశారు. అయితే ఆ సమయంలో మహేష్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. మహేష్ అన్నయ్య రమేష్ బాబు అనారోగ్యంతో మృతి చెందారు. మరోవైపు మహేష్ కరోనాతో బాధపడుతున్నారు. దీంతో సంక్రాంతికి ఎటువంటి అప్డేట్ రాలేదు.
కాగా నేడు రిపబ్లిక్ డే(Republic day)ని పురస్కరించుకొని ఫిబ్రవరి 14న సర్కారు వారి పాట నుండి ఫస్ట్ సింగిల్ (First single) విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పియానో ముందు కూర్చొని మైమరచి వాయిస్తున్న ఫోటోతో కూడిన పోస్టర్ విడుదల చేశారు. సర్కారు వారి పాట చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఫుల్ ఫార్మ్ లో ఉండగా.. స్టార్ దర్శకులు, హీరోలు ఆయన వెంటే పడుతున్నారు. ఇక మహేష్ (Mahesh babu) కోసం థమన్ ఎలాంటి ట్యూన్స్ ఇస్తాడనే ఆసక్తి కొనసాగుతుంది.
ప్రేమికుల రోజు నాడు సర్కారు వారి పాట మూవీ సాంగ్ తో ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేసుకోనున్నారు. కాగా సర్కారు వారి పాట మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక మరో ముపై రోజుల షూటింగ్ మిగిలి ఉంది. ఏప్రిల్ 1న సర్కారు వారి పాట విడుదల కానున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. అయితే ఇది మారే అవకాశం కలదు. అదే రోజున ఆచార్య విడుదల చేస్తున్నట్లు ప్రకటన జరిగింది.