అఫీషియల్: 'పుష్ప' రిలీజ్ డేట్ ప్రకటన

Surya Prakash   | Asianet News
Published : Aug 03, 2021, 02:15 PM IST
అఫీషియల్: 'పుష్ప' రిలీజ్  డేట్ ప్రకటన

సారాంశం

 ఆగస్ట్ లో కరోనా థర్డ్ వేవ్ వచ్చే ఆస్కారం ఉందని, అది సర్దుమణగటానికి మూడు నెలలు పడుతుందని, సో… క్రిస్మస్ కానుకగా డిసెంబర్ చివరి వారంలో తమ చిత్రాన్ని విడుదల చేస్తే సేఫ్ అని ‘పుష్ప’ టీమ్ భావిస్తోందట. 

సుకుమార్,  అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప”. ఈ చిత్రం రెండు పార్ట్ లకు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.   కరోనా ప్రభావం,సుకుమార్ కు జ్వరం రావటం వలన కొన్నిరోజుల క్రితం ఆగిపోయిన షూటింగు, రీసెంట్ గా హైదరాబాద్ లో మొదలైంది.  అంతా అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమా దసరా బరిలో నిలిచేది. కానీ కరోనా వలన షూటింగు విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. అందువలన ఈ సినిమాను 'క్రిస్మస్' కానుకగా డిసెంబర్ 24వ తేదీన విడుదల చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చింది. తన కెరియర్లోనే ఈ సినిమా ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని ఇప్పటికే అల్లు అర్జున్ చెప్పడంతో, ఒక రేంజ్ లో ఎక్సపెక్టేషన్స్ బాగా పెరిగిపోయాయి.  

https://twitter.com/alluarjun/status/1422458496075792391
 
మరో ప్రక్క ‘పుష్ప’ ప్రచారం ప్రారంభం కానుంది.  ఈ చిత్రం తొలి పాటని ఆగస్టు 13న విడుదల చేయనున్నారు. ఆ విషయాన్ని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ప్రకటించారు  హీరో అల్లు అర్జున్‌. తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి పాటని విడుదల చేయనున్నారు. ‘దాక్కో దాక్కో మేక... పులొచ్చి కొరుకుద్ది పీక...’ అంటూ సాగే తెలుగు గీతాన్ని శివమ్‌ ఆలపించారు. 

మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్‌ - సుకుమార్‌ - దేవిశ్రీప్రసాద్‌ కలయికలో వచ్చిన ‘ఆర్య’, ‘ఆర్య2’ పాటలు పెద్ద హిట్ అయ్యాయి. పదేళ్ల తర్వాత ఈ కలయికలో వస్తున్న సినిమానే ‘పుష్ప’. శేషాచలం అడవుల్లో... ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోంది. పుష్పరాజ్‌ పాత్రలో అల్లు అర్జున్‌ సందడి చేయనున్నారు. ప్రధాన విలన్ పాత్రలో ఫహద్ ఫాసిల్ నటిస్తుండగా… ఈ యాక్షన్ డ్రామాను ముత్తాశెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

ఇక ఇప్పటికే  మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. జనవరి 13, 2022 అని పోస్టర్ లో డేట్ పడింది. అలాగే ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’ డేట్ కూడా వచ్చేసింది. జనవరి 14, 2022… దాని విడుదల తేదీ. మరో ప్రక్క పవన్ కళ్యాణ్ – రానా కాంబినేషన్ మూవీ కూడా సంక్రాంతి బరిలోకి దూకుతోంది. ఈ సినిమాకి ఇంకా టైటిల్ చెప్పలేదు. డేట్ కూడా ప్రకటించలేదు. జనవరి 12, 2022 అనే డేట్ అనుకుంటున్నట్లు సమాచారం. వెంకటేష్, వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ “F3” కూడా జనవరి 12 కానీ, జనవరి 14 కానీ విడుదలయ్యే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

Top 5 Disasters: నిర్మాతలను ముంచేసిన టాలీవుడ్‌ టాప్‌ 5 డిజాస్టర్లు ఇవే
Superstar krishna: ఎన్టీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చాడు, డైరెక్టర్‌ చనిపోయాడు, అయినా కృష్ణ తగ్గలేదు.. ఇండస్ట్రీ రికార్డులన్నీ షెడ్డుకి