శాకుంతలం సెట్స్ లో అల్లు అర్హ.. వైరల్ వీడియో

By team teluguFirst Published Aug 3, 2021, 4:04 PM IST
Highlights

శాకుంతలం చిత్రం కోసం హైదరాబాద్ లో ప్రత్యేకమైన సెట్స్ వేశారు. ఖరీదైన సెట్స్ లో శాకుంతలం మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ రోల్ చేస్తున్నారు. 


లిటిల్ ప్రిన్స్ అర్హ షూటింగ్ సెట్స్ లో జాయిన్ అయ్యారు. అర్హకు మేకప్ టీమ్ మేకప్ వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత, గుణశేఖర్ కాంబినేషన్ లో శాకుంతలం టైటిల్ తో పాన్ ఇండియా మూవీ తెరక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కి ముందే శాకుంతలం మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. సెకండ్ వేవ్ తరువాత కొంత బ్రేక్ రాగా, ఇటీవల షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. 

శాకుంతలం చిత్రం కోసం హైదరాబాద్ లో ప్రత్యేకమైన సెట్స్ వేశారు. ఖరీదైన సెట్స్ లో శాకుంతలం మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ రోల్ చేస్తున్నారు. భరతుని కూతురుగా ఆమె కనిపించనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. 

కాగా శాకుంతలం సెట్స్ లో అల్లు అర్హ జాయిన్ అయ్యారు. అర్హకు కారవాన్ లో మేకప్ వేస్తున్న వీడియో శాకుంతలం టీమ్ విడుదల చేశారు. సదరు వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మొదటి సారి శాకుంతలం చిత్రంతో అల్లు అర్హ వెండితెరపై కనిపించనున్నారు. 

ఇక శాకుంతలం పౌరాణిక గాథగా తెరకెక్కుతుంది. మలయాళ నటుడు దేవ్ మోహన్ సమంతకు జంటగా దుష్యంతుడు పాత్ర చేస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. 

is back on the sets. The little Prince Bharata joins the ongoing schedule of the mythological drama , which is currently underway in Hyderabad. pic.twitter.com/XTiEQP26QD

— Sarath Chandra Naidu (@imsarathchandra)
click me!