'ఇస్మార్ట్ శంకర్' టీజర్.. రామ్ మాస్ అవతారం!

Published : May 15, 2019, 11:00 AM IST
'ఇస్మార్ట్ శంకర్' టీజర్.. రామ్ మాస్ అవతారం!

సారాంశం

ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తోన్న తాజా చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'.. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా టీజర్ ని ఈరోజు రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.

ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తోన్న తాజా చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'.. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా టీజర్ ని ఈరోజు రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. 'పతా హై మై కౌన్‌ హూ.. శంకర్‌.. ఉస్తాద్‌ ఇస్మార్ట్‌ శంకర్‌' అంటూ రామ్ చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలైంది.

టీజర్ మొత్తం కూడా రామ్ ఊర మాస్ అవతారంలో అలరించాడు. 'నాతో కిరికిరి అంటే పోచమ్మ గుడి ముంగట పొట్టేలుని కట్టేసినట్లే..' అంటూ టీజర్ చివరలో రామ్ చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది.

నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌పై పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం గోవాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. 

రామ్‌, నభాలపై ఓ పాటను తెరకెక్కిస్తున్నారు. మరో మూడు పాటలను చిత్రీకరిస్తే షూటింగ్ పూర్తవుతుంది. జూన్ లేదా జూలైలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Anupama Parameswaran: ఆ రెండేళ్లూ నరకం చూశా.. ప్రియుడి మానసిక వేధింపులపై ఓపెన్ అయిన అనుపమ.. ఎవరో తెలుసా?
Bigg Boss Agnipariksha: లేడీ కంటెస్టెంట్‌ షూస్‌ క్లీన్‌ చేసిన అభిజీత్‌.. దెబ్బకి పొగరు మొత్తం దిగింది