శ్రీముఖి కొత్త షో.. దీపికా పిల్లి షో కొట్టేసిన బుల్లితెర రాములమ్మ.. రచ్చ నెక్ట్స్ లెవల్

Published : Nov 25, 2023, 10:30 PM IST
శ్రీముఖి కొత్త షో.. దీపికా పిల్లి షో కొట్టేసిన బుల్లితెర రాములమ్మ.. రచ్చ నెక్ట్స్ లెవల్

సారాంశం

యాంకర్‌ శ్రీముఖి ప్రస్తుతం రెండు మూడు షోలతో బిజీగా ఉంది. ఇప్పుడు మరో కొత్త షోకి కమిట్‌ అయ్యింది. అయితే దీపికా పిల్లి షోని ఆమె లాక్కోవడం గమనార్హం. 

శ్రీముఖి యాంకర్‌గా బిజీగా ఉంది. నటిగా ఆమె సక్సెస్‌ కాలేదు. కానీ యాంకర్‌గా దుమ్మురేపుతుంది. ప్రస్తుతం తెలుగు యాంకర్లలో ఆమె టాప్‌ పొజిషియన్‌లో ఉంది. ఒక్కో షోని సొంతం చేసుకుంటూ వెళ్తుంది. తాజాగా ఇప్పటికే `డాన్స్ ఐకాన్‌` `మిస్టర్‌ అండ్‌ మిసెస్‌`, `సారంగ దరియా`, `స్టార్ మా పరివారం` వంటి షోస్‌ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో షోని సొంతం చేసుకుంది. అయితే దీపికా పిల్లి షోని కొట్టేయడం గమనార్హం. 

దీపికా పిల్లి, సుడిగాలిసుధీర్‌ యాంకర్లుగా ఓటీటీలో `కామెడీ స్టాక్‌ ఎక్స్ ఛేంజ్‌` షో ప్రసారమైంది. స్టాండప్‌ కామెడీ షోగా ఇది ఆదరణ పొందింది. `ఆహా`లో ఈ షో రన్‌ అయ్యింది. తాజాగా ఈ షో రెండో సీజన్‌ ప్రారంభం కాబోతుంది. అయితే ఇప్పుడు యాంకర్‌ మారింది. దీనికి శ్రీముఖి యాంకర్ గా ఎంపిక కావడం విశేషం. ఈ మేరకు ఆమె మీద ప్రోమో కూడా షూట్‌ చేశారు. తాజాగా దీన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది శ్రీముఖి. 

ఈ షోకి దర్శకుడు అనిల్‌ రావిపూడి జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రెండో సీజన్‌లోనూ ఆయన జడ్జ్ గా ఉన్నారు. త్వరలోనే `ఆహా` ఓటీటీలో ఈ షో ప్రారంభం కానుంది. ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమోలో రెడ్‌ డ్రెస్‌లో దుమ్మురేపుతుంది శ్రీముఖి. తన భారీ అందాలతో మత్తెక్కిస్తుంది. అంతేకాదు ఈ వీడియో పోస్ట్ చేస్తూ కామెడీ స్టాక్‌ ఎక్స్ ఛేంజ్‌కి క్వీన్‌ అంటూ పోస్ట్ చేయడం విశేషం. ఇక ఇప్పటికే పెద్దగా ఆఫర్లు లేక ఇబ్బంది పడుతుంది దీపికా పిల్లి. ఆమె చేతిలో ఉన్న ఒక్క షోని కూడా శ్రీముఖి లాక్కోవడం గమనార్హం. పాపం దీపికా పిల్లి. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?