Mahesh Babu: రాజమౌళి-త్రివిక్రమ్ చిత్రాలపై మహేష్ కీలక వ్యాఖ్యలు!

Published : May 10, 2022, 05:27 PM IST
Mahesh Babu: రాజమౌళి-త్రివిక్రమ్ చిత్రాలపై మహేష్ కీలక వ్యాఖ్యలు!

సారాంశం

సర్కారు వారి పాట మూవీ ప్రమోషన్స్ లో మహేష్ ఫుల్ బిజీగా ఉన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అలాగే త్రివిక్రమ్, రాజమౌళి చిత్రాలపై ఆయన స్పందించారు.   

టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ సక్సెస్ సైతం అందుకున్నారు. ఈ లీగ్ లో మిగిలింది మహేష్, పవన్ కళ్యాణ్ మాత్రమే. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ పాన్ ఇండియా విడుదలకు సరైన చిత్రంగా యూనిట్ భావిస్తున్నారు. ఇక లేటెస్ట్ ఇంటర్వ్యూలో మహేష్ (Mahesh Babu) ని పాన్ ఇండియా చిత్రం గురించి ప్రశ్నలు అడిగారు. ఇంకా పాన్ ఇండియా మూవీ చేయకపోవడానికి కారణం అడుగగా.. ఆయన స్పందించారు. 

పాన్ ఇండియా విడుదలకు సరైన చిత్రం కోసం ఎదురుచూస్తున్నాను. రాజమౌళి (Rajamouli) వంటి దర్శకుడి సినిమాతో ఎంట్రీ ఇవ్వడం గొప్ప నిర్ణయంగా భావిస్తున్నాను. రాజమౌళితో నేను చేయనున్న మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుందని మహేష్ తెలియజేశారు. అలాగే దర్శకుడు త్రివిక్రమ్ చేస్తున్న మూవీ కూడా సెట్స్ పైకి వెళ్లనుందన్నారు. త్రివిక్రమ్, రాజమౌళి సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ విడుదలవుతాయని తెలియజేశారు. ఇక డైరెక్ట్ బాలీవుడ్ మూవీ చేసే ఆలోచన లేదని ఆయన తెలిపారు. నేను తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోగానే భావిస్తాను అన్నారు. 

కాగా త్రివిక్రమ్ (Trivikram) మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. రాజమౌళి మూవీ మాత్రం ఆలస్యమయ్యే సూచనలు కలవు. ఈ ప్రాజెక్ట్ కి కథ అందిస్తున్న విజయేంద్రప్రసాద్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు. స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. 2023 లో మహేష్-రాజమౌళి మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదని ఆయన చెప్పారు. కాబట్టి అన్ని పరిస్థితులు అనుకూలిస్తే.. ఈ మూవీ 2025 లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కలదు. ఇక ఈ ప్రాజెక్ట్ జోనర్ పై అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నా స్పష్టమైన సమాచారం లేదు. 

ఇక సర్కారు వారి పాట మే 12న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. మూవీ ట్రైలర్ కి విశేష స్పందన దక్కిన తరుణంలో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. రికార్డు ఓపెనింగ్స్ దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన సర్కారు వారి పాట మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా