Shiva Shankar Master: శివ శంకర్‌ మాస్టర్‌కి జాతీయ అవార్డుని తీసుకొచ్చిన తెలుగు సినిమా!

By Aithagoni RajuFirst Published Nov 28, 2021, 10:05 PM IST
Highlights

శివశంకర్‌ మాస్టర్‌ తెలుగులో ప్రధానంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు జాతీయ స్తాయిలో గుర్తింపు తెచ్చింది కూడా తెలుగు చిత్ర పరిశ్రమే కావడం విశేషం.

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌(Shiva Shankar Master) మరణం తెలుగు చిత్ర పరిశ్రమనే కాదు, యావత్‌ సౌత్‌ ఇండస్ట్రీని సైతం షాక్‌కి గురి చేసింది. కరోనాతో పోరాతూ ఆయన ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 800లకుపైగా చిత్రాలకు డాన్స్ మాస్టర్‌గా పనిచేసిన ఆయన అనేక అద్భుతమైన పాటలకు నృత్యాలు కంపోజ్‌ చేశారు. పది భాషల్లో ఆయన కొరియోగ్రాఫర్‌గా పనిచేయడం విశేషం. డాన్సుల్లో ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచారు శిShiva Shankar Master. సాంప్రదాయ నృత్యానికి మోడ్రన్‌ స్టయిల్‌ని అద్ది వెండితెరపై మ్యాజిక్‌ చేసిన ఘనత శివశంకర్‌ మాస్టర్‌కే దక్కింది. 

శివశంకర్‌ మాస్టర్‌ తెలుగులో ప్రధానంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు జాతీయ స్తాయిలో గుర్తింపు తెచ్చింది కూడా తెలుగు చిత్ర పరిశ్రమే కావడం విశేషం. తమిళనాడులో పుట్టి పెరిగిన శివశంకర్ మాస్టర్‌ తెలుగులో, టాలీవుడ్‌లో సెటిల్‌ అయ్యారు. తనకు తిరుగులేని గుర్తింపుని తీసుకొచ్చిందన్నా, జీవితాన్నిచ్చిందన్నా తెలుగు పరిశ్రమనే అని ఆయన చాలా సందర్బాల్లో చెప్పుకొచ్చారు. శివశంకర్‌ మాస్టర్‌ `మగధీర`(Magadheera) చిత్రానికి కొరియోగ్రఫీ చేశారు. ఇందులో `ధీర ధీర ధీర.. `అనే పాటకి కొరియోగ్రఫీ చేశారు. 

రామ్‌చరణ్‌, కాజల్‌ మధ్య ఫ్లాష్‌ బ్యాక్‌లో, పీరియడ్‌ టైమ్‌లో వచ్చే లవ్‌ మెలోడీ సాంగ్‌ అయిన `ధీర ధీర ధీర`కి అద్భుతమైన డాన్సులు కంపోజ్‌ చేశారు శివశంకర్‌ మాస్టర్‌. దీంతో ఏకంగా జాతీయ అవార్డుని అందుకున్నారు. 57వ జాతీయ అవార్డు వేడుకల్లో ఆయనకు ఈ పాటకిగానూ కొరియోగ్రాఫర్‌గా జాతీయ పురస్కారం అందుకున్నారు. దీంతోపాటు నాలుగు తమిళనాడు స్టేట్‌ అవార్డులను సొంతం చేసుకున్నారు శివశంకర్‌ మాస్టర్‌. 

శివశంకర్‌ మాస్టర్‌..చిరంజీవి చిత్రాలకు కూడా పనిచేశారు. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది `ఖైదీ`. కమర్షియల్‌ సినిమాలో కొత్త ఊపుని తీసుకొచ్చిన ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుంది. ఈ సినిమాకి శివశంకర్‌ మాస్టర్‌ డాన్సులు కంపోజ్‌ చేయడం విశేషం. వీటితోపాటు `అమ్మోరు`, `సూర్యవంశం`, `అల్లరి పిడుగు`, `అరుంధతి`, `మహాత్మ,` `బాహుబలిః ది బిగినింగ్‌` చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా చేశారు. తనకంటూ సెపరేట్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. కొరియోగ్రాఫర్‌గా ఓ వెలుగు వెలిగిన ఆయన చివరి రోజుల్లో మాత్రం సినిమాలు లేక ఇబ్బంది పడాల్సి వచ్చింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు తోడయ్యాయి. కరోనాతో పోరాడే క్రమంలో ఆయన ట్రీట్‌మెంట్‌కి భారీ ఖర్చు అవుతున్న నేపథ్యంలో చిరంజీవి లాంటి చాలా మంది ప్రముఖులు తమ వంతు సాయాన్ని అందించారు. 

also read: Shiva Shankar master:సాయం అందినా దక్కని ప్రాణం... శివ శంకర్ మృతి తీరని విషాదం

click me!