యాంకర్‌ రవి, హమీద సేప్‌.. ఆ నలుగురిలో ఎలిమినేట్‌ ఎవరు? ఆమే కన్ఫమా?

Published : Sep 11, 2021, 11:01 PM ISTUpdated : Sep 11, 2021, 11:28 PM IST
యాంకర్‌ రవి, హమీద సేప్‌.. ఆ నలుగురిలో ఎలిమినేట్‌ ఎవరు?  ఆమే కన్ఫమా?

సారాంశం

ఫస్ట్ వీక్‌ ఫస్ట్ ఎలిమినేషన్‌ ఎవరా? అనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఊహాగానాలను స్టార్ట్ చేశారు. ఈ వారం జెస్సీ ఎలిమినేట్‌ అయ్యే ఛాన్స్ ఉందని అంతా అంటున్నారు. అదే సమయంలో కాజల్‌, సరయు విషయంలోనూ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ...

బిగ్‌బాస్‌5 తెలుగు ఫస్ట్ వీక్‌ సరదా ముగిసింది. ఇక ఎలిమినేషన్‌ ప్రారంభమైంది. ఇప్పటికే ఎలిమినేషన్‌కి నామినేషన్‌లో ఉన్న యాంకర్‌ రవి, హమీద, సరయు, కాజల్‌, జెస్సీ, మానస్‌లో ఇద్దరు సేవ్‌ అయ్యారు. యాంకర్‌ రవి, హమీద సేవ్‌ అయ్యారు. మొదటి వీక్‌ ఆరుగురిలో శనివారం ఇద్దరు సేవ్‌ అయ్యారు. ఇక మిగిలింది కాజల్‌, సరయు, జెస్సీ, మానస్‌. వీరిలో ఫస్ట్ వీక్‌ ఎలిమినేట్‌ అయ్యేది ఎవరనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. 

ఫస్ట్ వీక్‌ ఫస్ట్ ఎలిమినేషన్‌ ఎవరా? అనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఊహాగానాలను స్టార్ట్ చేశారు. ఈ వారం జెస్సీ ఎలిమినేట్‌ అయ్యే ఛాన్స్ ఉందని అంతా అంటున్నారు. అదే సమయంలో కాజల్‌, సరయు విషయంలోనూ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాజల్‌ కొత్త కాదు. ఆమె చాలా వరకు నెట్‌వర్క్ మెయింటేన్‌ చేస్తుంది. కాబట్టి ఆమె ఎలిమినేట్‌ అయ్యే ఛాన్స్‌ తక్కువ. ఇక జెస్సీ పూర్తిగా కొత్త, సరయు పెద్దగా తెలిసిన ఫేస్‌ కాదని, వీరిద్దరిలోనే ఒకరు ఉందే ఛాన్స్ ఉందని సోషల్‌ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. సరయు ఎలిమినేట్‌ కాబోతుందనే టాక్‌ బలంగా వినిపిస్తుంది. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే ఫస్ట్ వీక్‌ ఎలిమినేషన్‌ ఉండకపోవచ్చే వాదన కూడా వినిపిస్తుంది. ఈ వారం అందరిని వదిలేసే ఛాన్స్ ఉందని, కొత్త, ఫస్ట్ వీక్‌ కాబట్టి అప్పుడే ఓ జడ్జ్ మెంట్‌కి రావడం కరెక్ట్ కాదని, ఫస్ట్ వీక్ ఎలిమినేషన్‌ లేకుండా చేయాలనే ఆలోచన కూడా బిగ్‌బాస్‌కి ఉందనే వాదన కూడా వినిపిస్తుంది. మరి నిజంగానే అలా జరుగుతుందా? లేక ఎలిమినేషన్‌ జరుగుతుందా? అన్నది తెలియాల్సి ఉంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌