
ఎప్పుడూ బుల్లితెర నవ్వుతూ కనిపించే యాంకర్ రష్మీ గౌతమ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తమ కుటుంబ సభ్యుల్లో ఒకరైన తన గ్రాండ్ మదర్ శుక్రవారం కన్నుమూసినట్టు ఆమె స్వయంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఇస్టా స్టోరీ ద్వారా తెలుపుతూ భావోద్వేగపు వ్యాఖ్యలు చేసింది. తనకెంతో ఇష్టమైన నానమ్మ చనిపోవడంతో గుండె బరువెక్కినందంటూ ఎమోషనల్ నోట్ రాసుకోచ్చింది.
నోట్ లో... ‘మా గ్రాండ్ మదర్ ప్రమీలా మిశ్రా (Pramila Mishra) ఈరోజు కన్నుమూశారు. ఆమె మరణంతో కుటుంబ సభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. బరువెక్కిన గుండెలతో ఆమెకు వీడ్కోలు పలికాం. తను చాలా స్ట్రాంగ్ విమెన్. మా అందరీపై ఆమె ప్రభావం ఉంటుంది. మా నుంచి దూరమైనా.. ఆమె అందమైన జ్ఞాపకాలు మాలో సజీవంగా ఉన్నాయి. ఓం శాంతి’ అంటూ ఎమోషనల్ అయ్యింది. విషయం తెలుసుకున్న రష్మీ ఫ్యాన్స్ ఆమెను ఓదార్చుతున్నారు.
రష్మీ గౌతమ్ ఏపీలోని విశాఖపట్నానికి చెందిన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి ఉత్తరప్రదేశ్ కు చెందిన వాడు కావడంతో ఒడిషా లాంగ్వేజీలోనూ అనర్గళంగా మాట్లాడగలదు. ఇరవై ఏండ్ల నుంచి సినీ ఫీల్డ్ లోనే ఉంటోంది. 2010లోని ‘ప్రస్థానం’ చిత్రంలో సపోర్టింగ్ రోల్ తో అలరించింది తెలుగు ఆడియెన్స్ కు దగ్గరైంది. ఆ తర్వాత వచ్చిన ‘జబర్దస్త్’ కామెడీ షోతో యాంకర్ గా అవతారం ఎత్తింది. మరోవైపు హీరోయిన్ గానూ వెండితెరపై అలరిస్తోంది. ‘గుంటూరు టాకీస్’,‘అంతం’, ‘నెక్ట్స్ నువ్వే’,‘అంతకు మించి’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’లో నటిస్తున్నట్టు తెలుస్తోంది.