ఏపీ రాజధాని వివాదం.. ఆ ప్రశ్నే తప్పంటూ యాంకర్ ప్రదీప్‌ క్షమాపణలు

Published : Jun 21, 2021, 05:57 PM IST
ఏపీ రాజధాని వివాదం.. ఆ ప్రశ్నే తప్పంటూ యాంకర్ ప్రదీప్‌ క్షమాపణలు

సారాంశం

యాంకర్‌ ప్రదీప్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ఎట్టకేలకు యాంకర్‌ ప్రదీప్‌ స్పందించారు. తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా ఓ వీడియోని పంచుకున్నారు. క్షమాపణలు తెలియజేశారు. 

టీవీ యాంకర్ ప్రదీప్‌ మాచిరాజు ఏపీ రాజధాని విషయంలో చేసిన కామెంట్లు వివాదంగా మారిన విషయం తెలిసిందే. దీంతో యాంకర్‌ వివాదాల్లో ఇరుక్కున్నారు. ఇది ఏపీలోని కొందరి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీనిపై ఏపీ పరిరక్షణ సమితి మండిపడింది. వెంటనే యాంకర్‌ ప్రదీప్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ఎట్టకేలకు యాంకర్‌ ప్రదీప్‌ స్పందించారు. తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా ఓ వీడియోని పంచుకున్నారు. క్షమాపణలు తెలియజేశారు. 

ఇందులో ఆయన మాట్లాడుతూ, `రీసెంట్‌గా జరిగిన ఓ షోలో రాష్ట్రం, దాని క్యాపిటల్‌ ఏంటి అనే ప్రశ్న అడుగుతున్న పద్ధతిలో నేను సీటీ పేరు చెప్పి, ఆ సిటీ క్యాపిటల్‌ ఏంటి అన్నాను. మీ ప్రశ్న తప్పు అని చెప్పకుండా అవతలి వ్యక్తి వేరే ఆన్సర్‌ ఇవ్వడంతో ఆ పూర్తి సంభాషణ తప్పుదోవలో వెళ్లింది. అందరికి వేరే విధంగా అర్థమయ్యింది. వాళ్లకది బాధ కలిగించింది. దీని ద్వారా ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా, ఎవరినైనా బాధ పెట్టినా మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా. ఇది ఉద్దేశ పూర్వకంగా చేసింది కాదు. ఎవరినో కించపరిచాలనో, హేళన చేయాలనే ఉద్దేశం ఎప్పుడూ ఉండదు. అలంటి పని నేను ఎప్పుడూ చేయను. దయచేసి అర్థం చేసుకుంటారని కోరుతున్నా` అని వెల్లడిచారు. 

ఓ టీవీ షోలో యాంకర్‌ ప్రదీప్‌ అమరావతి రాజధాని ఏంటి? అని అడగ్గా అందులో పాల్గొన్న ఆర్టిస్ట్ వైజాగ్‌ పేరు చెబుతుంది. దీంతో ఇది వివాదంగా మారింది. దీనిపై ఏపీ పరిరక్షణ సమితి మండిపడింది.  ప్రదీప్ క్షమాపణ చెప్పకుంటే హైదరాబాద్‌లోని అతడి ఇంటిని ముట్టడిస్తామని ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికలపూడి శ్రీనివాసరావు హెచ్చరించారు. కోర్టులో ఉన్న అంశాలపై యాంకర్ ప్రదీప్‌ ఎలా మాట్లాడతారని ఆయన ప్రశ్నించారు. రైతులు, ప్రజల మనోభావాలు కించపర్చేలా వ్యవహరిస్తే సహించబోమన్నారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని లేదంటే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. దీంతో ప్రదీప్‌ సారీ చెప్పారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది