నయనతారలో విగ్నేష్ ఇష్టపడేది ఇదే...

Published : Jun 21, 2021, 04:08 PM ISTUpdated : Jun 21, 2021, 04:29 PM IST
నయనతారలో విగ్నేష్ ఇష్టపడేది ఇదే...

సారాంశం

నయనతార-విగ్నేష్ పెళ్లి త్వరలో అంటూ అనేక మార్లు పుకార్లు లేచాయి. ఈ పెళ్లివార్తలపై కొన్ని సార్లు విగ్నేష్ సైతం స్పందించారు. తాము ప్రస్తుతం డేటింగ్ ఎంజాయ్ చేస్తున్నామని, అది బోర్ కొట్టాక పెళ్లి చేసుకుంటాం అని చెప్పడం జరిగింది.

దాదాపు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు నయనతార, విగ్నేష్ శివన్. సందర్భం ఏదైనా జంటగా కలిసి జరుపుకుంటారు. బర్త్ డే వేడుకల కోసం మంచి రొమాంటిక్ ప్రదేశాన్ని ఎంచుకొని కొన్ని రోజులు విహారానికి వెళ్లి ఎంజాయ్ చేసి వస్తారు. ముఖ్యమైన పండగలకు కొత్త అల్లుడు మాదిరి కేరళ నయనతార ఇంటికి వెళతాడు విగ్నేష్. పెళ్లికాకయినా అంత కంటే సన్నిహితంగా ఉంటున్నారు ఈ జంట. 


నయనతార-విగ్నేష్ పెళ్లి త్వరలో అంటూ అనేక మార్లు పుకార్లు లేచాయి. ఈ పెళ్లివార్తలపై కొన్ని సార్లు విగ్నేష్ సైతం స్పందించారు. తాము ప్రస్తుతం డేటింగ్ ఎంజాయ్ చేస్తున్నామని, అది బోర్ కొట్టాక పెళ్లి చేసుకుంటాం అని చెప్పడం జరిగింది. స్టార్ హీరోయిన్ గా నయనతార వరుస ఆఫర్స్ తో బిజీగా ఉన్నారు. అలాగే శివన్ దర్శకుడిగా కొన్ని సినిమాలు చేస్తున్నారు. 


కాగా విగ్నేష్ శివన్ సోషల్ మీడియా చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఓ అభిమాని.. నయనతారలో మీకు నచ్చిన అంశం ఏమిటని అడుగగా.. ఆమెలోని కాన్ఫిడెంట్ అంటే చాలా ఇష్టం అని విగ్నేష్ తెలిపారు. ఆ కాన్ఫిడెంట్ తోనే పర్సనల్ లైఫ్ లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా స్ట్రాంగ్ గా నిలబడ్డారు నయనతార. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్ జోకర్ గెటప్ వెనుకున్న వ్యక్తి ఎవరంటే.? మనసులోని మాట చెప్పిన డైరెక్టర్ మారుతీ
Poonam Kaur: ఆ స్టార్‌ హీరోని తన భార్యాపిల్లల వద్దకు వెళ్లకుండా చేశాడు.. డైరెక్టర్‌ దారుణాలు బయటపెట్టిన పూనమ్‌ కౌర్‌