కట్టెల పొయ్యిపై నాటుకోడి పులుసు.... యాంకర్ లాస్య వంటల వీడియో వైరల్!

Published : Jun 21, 2023, 08:10 PM IST
కట్టెల పొయ్యిపై నాటుకోడి పులుసు.... యాంకర్ లాస్య వంటల వీడియో వైరల్!

సారాంశం

యాంకర్ లాస్య మామిడి తోటలో నోరూరించే కోడి కూర చేసింది. కట్టెల పొయ్యమీద పల్లెటూరి పద్ధతిలో వండి వార్చింది. లాస్య వంటల వీడియో వైరల్ అవుతుంది.   

యాంకర్ లాస్య భర్త మంజునాథ్ కి ఇష్టమైన నాటుకోడి పులుసు వండి పెట్టింది. అది కూడా పచ్చని ప్రకృతి మధ్య మామిడి తోటలో కట్టెల పొయ్యి మీద చేసింది. లాస్య కోడి కూర వండిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతుంది. నెటిజెన్స్ నోరూరుతుందని కామెంట్స్ చేస్తున్నారు. ఆటవిడుపుగా పల్లెటూరు వెళ్లిన లాస్య మామిడి తోటలో వంట చేసింది. 

కాగా లాస్య హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనుభవిస్తున్నారు. ఆమె ఇటీవల రెండో బిడ్డకు జన్మనిచ్చారు. మరోసారి ఆమె అబ్బాయిని కన్నారు. మొదటి సంతానంగా లాస్యను ఒక అబ్బాయి. పెద్దబ్బాయికి ఆరేడేళ్లు ఉంటాయి. గతంలో సెకండ్ చైల్డ్ గురించి అడుగుతుంటే కోపం వస్తుందని లాస్య అన్నారు. దాంతో ఇకపై ఆమె పిల్లల్ని కనరని అభిమానులు భావించారు. లాస్య ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమించినవాడితో పెళ్ళికి  లాస్య తండ్రి అంగీకరించలేదట. దీంతో ఆమె చాలా కాలం పేరెంట్స్ తిరస్కరణకు గురయ్యారట. తమకు ఓ బిడ్డ పుట్టాక పేరెంట్స్ దగ్గరయ్యారని లాస్య చెప్పుకొచ్చింది.

ఇక యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన లాస్య  బిగ్ బాస్ షోతో మరింత పాపులర్ అయ్యారు. మంచి ఫార్మ్ లో ఉన్న సమయంలో లాస్య వ్యక్తిగత కారణాలతో బుల్లితెరకు దూరం అయ్యారు. తర్వాత సడన్ గా బిగ్ బాస్ సీజన్ 4లో ప్రత్యక్షం అయ్యారు. హౌస్ లో లాస్య తన ప్రత్యేకత చాటుకున్నారు. ముఖ్యంగా ఆమె కంటెస్టెంట్స్ కి రుచికరమైన భోజనం వండి పెడుతూ ఉండేవారు. అందరితో ఆమె సన్నిహితంగా మెలిగేవారు. చాలా తక్కువ సందర్భాల్లో లాస్య సహనం కోల్పోయారు. అదే సమయంలో ఈమె కూడా ఓ గ్రూప్ మైంటైన్ చేశారు. అభిజిత్, హారిక, నోయల్, లాస్య ఓ జట్టుగా ఉండేవారు. వీరిలో ఒకరైన అభిజీత్ బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ అందుకున్నారు. అభిజీత్ టైటిల్ గెలవడంతో లాస్య ఆనందం వ్యక్తం చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan తో నటించి కనిపించకుండా పోయిన హీరోయిన్లు, లిస్ట్ లో ఐదుగురు.. ఆమె మాత్రం చేజేతులా..
10 భాషల్లో 90 సినిమాలు.. 50 ఏళ్ల పెళ్లి కాని బ్యాచిలర్ హీరోయిన్ ఎవరో తెలుసా ?