ఆయనేం చేయకుండానే రక్కేస్తానా?, ఇంకా చిరు ట్వీట్, మోహన్ బాబు పిలుపు

By Surya PrakashFirst Published Oct 11, 2021, 11:31 AM IST
Highlights

‘మా’ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకు చిరంజీవి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. ‘‘మా’ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకి, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌, మిగతా విజేతలందరికీ పేరు పేరునా నా అభినందనలు. 

హోరాహోరీగా సాగిన ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించారు. ప్రకాశ్‌రాజ్‌పై 107 ఓట్ల తేడాతో మంచు విష్ణు గెలుపొందారు. విష్ణుకు 381 ఓట్లు రాగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు వచ్చాయి.  ‘మా’ చరిత్రలోనే అత్యధిక పోలింగ్‌ నమోదైంది. ‘మా’లో మొత్తం 883 మందికి ఓటు హక్కు ఉండగా వారిలో 665మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఎలక్షన్ పూర్తయ్యి, రిజల్ట్ వచ్చేసినా కొన్ని సంఘటనలను మాత్రం మీడియా,సోషల్ మీడియా మర్చిపోలేకపోతోంది. అంలాంటివాటిలో  హేమ, శివబాలాజీ కొరుకుడు సంఘటన ఒకటి. దాన్ని తెగ ట్రోల్ చేస్తున్నారు, ఫన్ చేస్తున్నారు. 

నటుడు శివబాలాజీ చేతిని నటి హేమ కొరికారు. ఈ విషయాన్ని నరేష్ బయటపెట్టారు. శివబాలాజీ చేతిపై ఉన్న గుర్తును మీడియాకు చూపించారు. జరిగిన ఘటనపై శివబాలాజీ సిగ్గుపడుతూ లోపలికి వెళ్లిపోయాడు. ఈ విషయమై హేమ స్పందిస్తూ ...ఆయనేం చేయకుండానే నేను కొరికి రక్కేస్తానా? ఆయన నన్ను ఏదో చేయబోయాడు. అందుకే నేను చేయి కొరకాల్సి వచ్చింది. నాకు అడ్డంగా ఆయన చేయి పెట్టాడు అంటూ చెప్పుకొచ్చింది.

ఇక శివ బాలాజీ మాత్రం...హేమ నన్ను ఎందుకు కొరికిందో తెలీదు అన్నారు. ఎవరో బయటి వ్యక్తి వచ్చి ప్రచారం చేస్తున్నాడు. అతడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించాను, కానీ పారిపోయాడు. ఇంతలో మనుషులు మీద పడుతున్నారని నేను రెండు చేతులతో రెండు పోల్స్ పట్టుకున్నాను. హేమ గారు ఎందుకు కొరికారో నాకు తెలీదు అని చెప్పుకొచ్చారు.

మరో ప్రక్క ‘మా’ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకు చిరంజీవి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. ‘‘మా’ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకి, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌, మిగతా విజేతలందరికీ పేరు పేరునా నా అభినందనలు. ఈ నూతన కార్యవర్గం మూవీ ఆర్టిస్టులందరి సంక్షేమానికి పాటుపడుతుందని ఆశిస్తున్నాను. ‘మా’ ఇప్పటికీ ఎప్పటికీ ఒకటే కుటుంబం. ఇందులో ఎవరు గెలిచినా మన కుటుంబం గెలిచినట్టే. ఆ స్ఫూర్తితోనే ముందుకు సాగుతామని నమ్ముతున్నాను’ అని చిరంజీవి పేర్కొన్నారు.    

‘మా’ ఎన్నికల్లో విష్ణును ఆశీర్వదించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లు మోహన్‌బాబు తెలిపారు. ఇక నుంచి ‘మా’ ఎన్నికలు ఏకగ్రీవమయ్యేలా చూసుకుంటామని తెలిపారు. జరిగిందేదో జరిగింది అని, అందరం ఒకే కుటుంబం అని మోహన్‌బాబు అన్నారు. ఇక నుంచి వివాదాలకు దూరంగా ఉందామని పిలుపునిచ్చారు. అధ్యక్షుడికి చెప్పకుండా ఎవరూ మీడియా ముందుకు వెళ్లవద్దని గెలిచిన సభ్యులకు సూచించారు. 
 

click me!