యాంకర్ ఝాన్సీకి కరోనా వైరస్..? క్లారిటీ

Published : Jul 06, 2020, 02:43 PM ISTUpdated : Jul 06, 2020, 03:03 PM IST
యాంకర్ ఝాన్సీకి కరోనా వైరస్..? క్లారిటీ

సారాంశం

కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో, ఆమె సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వాటిపై స్పందించిన ఝాన్సీ, తనకు కరోనా సోకలేదని స్పష్టం చేశారు.

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. సామాన్యులు, సెలబ్రెటీలు అనే తేడా లేకుండా అందరినీ ఈ వైరస్ భయపెడుతోంది. కాగా... ఇటీవల తెలంగాణలో షూటింగ్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలో కొందరు సిరియల్ నటులు ఈ వైరస్ బారినపడ్డారు. అయితే.. తాజాగా.. తెలుగు బుల్లితెర యాంకర్ ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందంటూ వార్తలు వచ్చాయి. ఆ యాంకర్ మరెవరో కాదు ఝాన్సీ అంటూ వార్తలు వచ్చాయి. 

కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో, ఆమె సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వాటిపై స్పందించిన ఝాన్సీ, తనకు కరోనా సోకలేదని స్పష్టం చేశారు.

ఇటీవల ఆమె ఓ టీవీ షూటింగ్‌లో పాల్గొనగా.. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఝాన్సీ తెలిపారు. కాగా ఈ యాంకర్‌కి ఎలాంటి లక్షణాలు లేవని, కానీ ఇంట్లో తన తల్లిదండ్రులతో కలిసి ఉండటంతోనే ఝాన్సీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఝాన్సీ చేసిన షోలో పాల్గొన్న ఇద్దరు నటులకు కరోనా సోకినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఝాన్సీ సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Maa Vande: మోదీ బయోపిక్‌ `మా వందే` బడ్జెట్‌ తెలిస్తే మతిపోవాల్సిందే.. వామ్మో ఇది హాలీవుడ్‌ రేంజ్‌
Anchor Rashmi: కల్చర్‌ మన బట్టల వద్దే ఆగిపోయింది.. రష్మి గౌతమ్‌ క్రేజీ కౌంటర్‌.. కుక్కల సమస్యపై ఆవేదన