వైరల్‌ వీడియో: ఎన్టీఆర్‌ పాటకు జపాన్‌లో యమా క్రేజ్

Published : Jul 06, 2020, 02:00 PM ISTUpdated : Jul 06, 2020, 02:01 PM IST
వైరల్‌ వీడియో: ఎన్టీఆర్‌ పాటకు జపాన్‌లో యమా క్రేజ్

సారాంశం

ఎన్టీఆర్, సమీరా రెడ్డి జంటగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అశోక్‌. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కాస్త బొద్దుగా కనిపించినా డ్యాన్స్‌ మూమెంట్స్‌తో సూపర్బ్ అనిపించాడు. అయితే తాజాగా ఆ సినిమాలోని గోల గోల అనే పాటకు ఓ జపనీస్‌ జంట డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యామిలీ సపోర్ట్ పెద్దగా లేకపోయినా స్వశక్తితో స్టార్‌ హీరో స్థాయికి ఎదిగాడు. ముఖ్యంగా తన డ్యాన్సింగ్ స్కిల్స్‌తో అందరినీ ఆకట్టుకున్న  జూనియర్‌లో విదేశాల్లోనూ పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్‌ ఉన్నారు. ముఖ్యంగా జపాన్‌లో రజనీకాంత్‌తో పాటు అదే స్థాయిలో ఎన్టీఆర్‌కు కూడా ఫ్యాన్స్ ఉన్నారంటేనే బుడ్డోడి క్రేజ్‌ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.

తాజాగా ఎన్టీఆర్‌కు విదేశాల్లో ఉన్న క్రేజ్‌కు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ వీడియో వైరల్‌గా మారింది. ఎన్టీఆర్, సమీరా రెడ్డి జంటగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అశోక్‌. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కాస్త బొద్దుగా కనిపించినా డ్యాన్స్‌ మూమెంట్స్‌తో సూపర్బ్ అనిపించాడు. అయితే తాజాగా ఆ సినిమాలోని గోల గోల అనే పాటకు ఓ జపనీస్‌ జంట డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తెర మీద ఎన్టీఆర్, సమీరాలు ఏ స్టెప్స్‌.. ఏ కలర్‌ డ్రెస్‌ కాంబినేషన్‌లో చేశారో.. అదే కలర్‌ డ్రెస్‌లో అవే స్టెప్స్ వేసి అలరించారు. ఎన్టీఆర్‌ కు ఏ మాత్రం తగ్గకుండా జపాన్‌ అభిమాని  చేసిన ఆ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాను షేర్ చేస్తోంది. జపాన్‌లో ఇతర హీరోలకు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా బాహుబలి సినిమా జపాన్‌లో ఓ రేంజ్‌లో సక్సెస్‌ అయ్యింది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?