పవన్,క్రిష్ చిత్రం టైటిల్ ఇదే ఫైనల్?!

By Surya Prakash  |  First Published Feb 3, 2021, 12:42 PM IST

 క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌ తన 27వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా టైటిల్ ఏంటనేది ఇప్పటిదాకా బయిటకు రాలేదు. రకరకాల టైటిల్స్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. తాజాగాఈ సినిమాకు ఓ ఇంట్రెస్టింగ్‌, పవర్‌ఫుల్‌ టైటిల్‌ను ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం మేరకు ‘హరిహర వీరమల్లు’ పేరుతో ఈ సినిమా తెరకెక్కించనున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. 


 పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కేవలం 15రోజుల షెడ్యూల్‌ మాత్రమే పూర్తి చేసుకుంది. ఆ మధ్యన వవన్‌ పుట్టిన రోజు సందర్భంగా ప్రీ లుక్‌ను విడుదల చేశారు. దర్శకుడు క్రిష్‌ ఈ సినిమాను పాన్‌ ఇండియా చిత్రంగా తీర్చిదిద్దేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతర భాషల్లోనూ అందరికీ నచ్చేలా టైటిల్‌ పెట్టాలని భావిస్తున్నారు.

Read more!

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు టైటిల్స్‌ సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొట్టాయి. వీటిలో ‘విరూపాక్ష’, ‘బందిపోటు’, ‘గజదొంగ’ అనే టైటిల్స్‌ మొదటి నుంచీ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాను పాన్‌ ఇండియా చిత్రంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో అన్ని వర్గాలకు చేరువయ్యేలా ఓ పవర్‌ఫుల్‌ టైటిల్‌ పెడితే బాగుంటుందని చిత్ర టీమ్ భావిస్తోంది. ఇందులో భాగంగానే ‘ఓం శివమ్‌’, అయితే ఎలాంటి ఉందని అనుకున్నారు. అదే సమయంలో మొదట అనుకున్న ‘విరూపాక్ష’ టైటిల్‌ను పరిశీలించారు. చివరకు ‘హరిహర వీరమల్లు’ దగ్గర ఆగారని తెలుస్తోంది. అయితే వీటిన్నటిలో చిత్ర టీమ్ దేన్ని ఖరారు చేస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Tap to resize

Latest Videos

పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కనున్న #PSPK27లో పవన్‌ డైమండ్ల దొంగగా కనిపించనున్నారట.  ఈ సినిమాలో పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్‌ నటించనుంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కావడంతో వీఎఫ్‌ఎక్స్‌ సన్నివేశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీంతో హాలీవుడ్‌ నిపుణులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ‘ఆక్వామెన్‌’, ‘స్టార్‌ వార్స్‌ ఎపిసోడ్‌ VII-ది ఫోర్స్‌ అవేకన్స్‌’, ‘వార్‌క్రాఫ్ట్‌’ వంటి చిత్రాలకు పనిచేసిన వీఎఫ్‌ఎక్స్‌ నిపుణుడు బెన్‌ లాక్‌ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. 

ఇటీవల పవన్‌ కల్యాణ్‌ సినిమాల జోరు పెంచారు. ఆయన కీలక పాత్రలో నటించిన ‘వకీల్‌ సాబ్’ దాదాపు షూటింగ్ పూర్తయింది.రిలీజ్ డేట్ సైతం ఇచ్చేసారు . ఏప్రిల్‌ 9న విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం పవన్‌-రానా ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. మలయాళీ చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’కు రీమేక్‌ అది. ఈ చిత్రానికి సాగర్‌.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.  ఇది కాకుండా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో మరో సినిమాలో పవన్‌ నటిస్తున్నారు. దీని తర్వాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో మరో చిత్రం ఉంటుంది.
 

click me!