
టాలీవుడ్ టాప్ యాంకర్స్ లో అనసూయ ఒకరు. ప్రస్తుతం అనసూయ నటిగా కూడా దూసుకుపోతోంది. ఇటీవల అనసూయ అల్లు అర్జున్ పుష్ప, రవితేజ ఖిలాడీ చిత్రాల్లో మెరిసింది. అనసూయకు ప్రస్తుతం టాలీవుడ్ ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. రంగస్థలం, పుష్ప చిత్రాల్లో తన వయసుకు మించిన పాత్రలు చేసిన ఈ హాట్ బ్యూటీ నటనతో మెప్పించింది.
ఇదిలా ఉండగా అనసూయకు సోషల్ మీడియాలో ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. తనపై ఎంతగా ట్రోల్స్ జరిగినా.. అనసూయ మాత్రం అంతే ఘాటుగా బదులిస్తూ ఉంటుంది. తన గురించి ఎలాంటి తప్పుడు ప్రచారం జరిగినా అనసూయ సహించదు. వెంటనే స్పందించడం చూస్తూనే ఉన్నాం.
తాజాగా ఓ వెబ్ సైట్ లో అనసూయ వయసుని 40 ఏళ్ళు అంటూ తప్పుగా ప్రచారం చేశారు. దీనికి అనసూయ ట్విట్టర్ లో సమాధానం ఇచ్చింది. నా వయసు 40 కాదు.. 36. వయసు ఎవరికైనా పెరుగుతూనే ఉంటుంది. ఆ ఫ్యాక్ట్ నాకు తెలుసు. కానీ వయసుకి తగ్గట్లుగా నేను అందంగా కనిపిస్తానని ప్రామిస్ చేస్తున్నా. కానీ జర్నలిస్ట్ లు ఇలా తప్పుడు ప్రచారం మాత్రం చేయొద్దు అంటూ చురకలంటించింది.
అనసూయ ఎంత కూల్ గా ఉంటుందో.. ఆమెలో అదే స్థాయిలో ఫైర్ బ్రాండ్ కూడా దాగి ఉంది. ఆ మధ్యన సీనియర్ నటుడు కోటా శ్రీనివాస రావు అనసూయ ధరించే బట్టలపై మండిపడ్డారు. దీనితో అనసూయ కూడా అంతే సీరియస్ గా కోటపై విమర్శలు చేసింది.
ఇదిలా ఉండగా అనసూయ ప్రస్తుతం పలు చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. పుష్ప 2లో ఆమె దాక్షాయణిగా అల్లు అర్జున్ పై ఎలా పగ తీర్చుకుంటుంది అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.