Anasuya: మా ఫ్యామిలీలో 'గే' లు ఉన్నారు, వాళ్లతో ఆ అనుభవం చాలాసార్లు అయ్యింది!

Published : Feb 24, 2023, 05:34 PM ISTUpdated : Feb 24, 2023, 06:04 PM IST
Anasuya: మా ఫ్యామిలీలో 'గే' లు ఉన్నారు, వాళ్లతో ఆ అనుభవం చాలాసార్లు అయ్యింది!

సారాంశం

అనసూయ బోల్డ్ ఆన్సర్ నెటిజన్స్ మైండ్ బ్లాక్ చేసింది. మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లో గే లు ఉన్నారంటూ ఆమె చెప్పడం సంచలనంగా మారింది.   

యాంకర్ అనసూయ డేరింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్య ఆమె మరింత రాటుదేలారు. మీరు ఎంత ట్రోల్ చేస్తే నేను అంతగా చెలరేగుతా అంటున్నారు. అసలు తగ్గేదేలేదని డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. కాగా అనసూయ లేటెస్ట్ కామెంట్స్ ఆమె గట్స్ ఏంటో నిరూపించాయి. అనసూయ లెస్బియన్స్ తో తనకు అలాంటి అనుభవాలు అయ్యాయంటూ ఒప్పుకున్నారు. 

అనసూయ అభిమానులతో ఆన్లైన్ చాట్ లో పాల్గొనున్నారు. ఈ క్రమంలో ఓ అభిమాని మీరు నిజంగా లిబరల్, మెట్యూర్డ్ ఉమన్ అయితే నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీకు ఎప్పుడైనా లెస్బియన్స్ తో అలాంటి అనుభవాలు అయ్యాయా? అని అడిగారు. ఈ ప్రశ్నకు అనసూయ స్పందించారు. 'మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లో స్వలింగ సంపర్కులు ఉన్నారు. అయితే పర్సనల్ గా నాకు లెస్బియన్స్ తో అలాంటి అనుభవాలు కాలేదు. ఆన్లైన్లో మాత్రం చాలా సార్లు అనుభవమైందని కామెంట్ చేశారు.  

డైరెక్ట్ గా నేను లెస్బియన్స్ తో శృంగారంలో పాల్గొనలేదు. అయితే ఆన్లైన్ లో ఎదురయ్యాయని అనసూయ చెప్పారు. మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లో గే లు ఉన్నారని చెప్పడం ఊహించని పరిణామం. ఇక ఆన్లైన్ లో లెస్బియన్ అనుభవాలు అయ్యాయని చెప్పి అనసూయ అతిపెద్ద చర్చకు దారితీసింది. ఈ చాట్ లో అనసూయ బుల్లితెర షోల మీద కూడా ఆరోపణలు చేయడం కొసమెరుపు. మీరు యాంకర్ గా బుల్లితెరకు ఎప్పుడు తిరిగి వస్తారని ఒకరు అడిగారు. 

టీఆర్పీ కోసం మేకర్స్ చేస్తే అవమానకర స్టంట్స్ పోతేకాని నేను రాను. అది జరగనిపని కాబట్టి బహుశా నేను మరలా యాంకరింగ్ చేయకపోవచ్చని వెల్లడించారు. ఈ చాట్ లో అనసూయ సోషల్ మీడియా ట్రోలింగ్ తో పాటు సీరియస్ మేటర్స్ మీద తన స్పందన తెలియజేశారు. ఈ మధ్య అనసూయ భారీగా ట్రోల్స్ కి గురవుతున్నారు. అదే స్థాయిలో ఆమె చర్యలు తీసుకుంటున్నారు. హద్దు మీరి ప్రవర్తిస్తే సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని అనసూయ అరెస్ట్ చేయించడం విశేషం. మరోవైపు అనసూయ చేతినిండా సినిమాలు, సిరీస్లతో బిజీగా ఉన్నారు. ఆమె కెరీర్ ప్రస్తుతం పీక్స్ లో ఉందని చెప్పొచ్చు. 

PREV
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో