Anasuya: తండ్రిని గుర్తు చేసుకుంటూ యాంకర్‌ అనసూయ ఎమోషనల్‌ పోస్ట్

Published : Dec 15, 2021, 04:08 PM IST
Anasuya: తండ్రిని గుర్తు చేసుకుంటూ యాంకర్‌ అనసూయ ఎమోషనల్‌ పోస్ట్

సారాంశం

తండ్రి మరణఃతో అనసూయ ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా అనసూయ స్పందించింది. తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌ అయ్యింది. ఈ మేరకు ఆమె ఓ భావోద్వేగ భరిత పోస్ట్ పెట్టింది.

యాంకర్‌ అనసూయ(Anasuya) `జబర్దస్త్`(Jabardasth) షోతో ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. ఇటీవల అనసూయ తండ్రి కన్నుమూసిన నేపథ్యంలో తాజాగా ఓ ఎమోషనల్‌ నోట్‌ని పంచుకుంది. యాంకర్ అనసూయ తండ్రి సుదర్శన్‌ రావు కస్బా పది రోజుల క్రితం(డిసెంబర్‌ 5న) క్యాన్సర్‌ కారణంగా కన్నుమూశారు. దీంతో అనసూయ ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా అనసూయ స్పందించింది. తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌ అయ్యింది. ఈ మేరకు Anasuya ఓ భావోద్వేగ భరిత పోస్ట్ పెట్టింది.

`నా అత్యంత అందమైన పాపాజీ(తండ్రిని ముద్దుగా). నేను నా చిత్తశుద్ధితో మిమ్మల్ని ఎప్పుడూ గర్వపడేలా చేస్తూనే ఉంటానని వాగ్దానం చేస్తున్నా. మీరిచ్చిన ఈ జీవితానికి ఎలా కృతజ్ఞత చెప్పాలో అర్థం కావడం లేదు. దాన్ని చెప్పేందుకు మాటలు లేవు. తినే భోజనం నుంచి వ్యాయామాల వరకు మేం ఏం చేయాలో, మా ఛాయిస్‌లను బోధించినందుకు మాటలు లేవు. మనం గడిపిన ఆనంద సమయాలన్నింటినీ నేను ఎప్పటికీ రక్షిస్తాను. మీరు అర్థరాత్రి ఇచ్చే సర్‌ప్రైజ్‌ ట్రీట్‌లన్నింటినీ ఎప్పటికీ మర్చిపోలేను. అదంతా మాపై మీకున్న అపరిమితమైన ప్రేమ. మన సొంత నిబంధనలపై జీవితాన్ని గడిపేలా నేర్పించారు. ధైర్యంగా, బలంగా ఉండమని నేర్పించారు. 

మీరు ఎప్పటికీ జనాలకు టైగర్‌ దర్శన్‌ పెహెల్వాన్‌గానే నిలిచి ఉంటారు. మీరు మా నాన్నగా ఎంతో గొప్పగా చేసి, మమ్మల్ని ఎంతో ఆదర్శంగా పెంచారని మనం ఏం చెప్పినా ఈ ప్రపంచం అలా ఉంటుందని నేను ఊహించను. మనం ఎలా ఉంటామో మీరు మమ్మల్ని వదిలి వెళ్లకముందే చెప్పాను. ఇప్పుడు మనం అందరితో కలిసి ఉంటాం. మీరు వెళ్లిపోయినా ఎప్పటికీ మాతోనే ఉంటారు. మీ ఆత్మకి శాంతి చేకూరాలి నాన్నా` అని తెలిపింది అనసూయ. 

అనసూయ యాంకర్‌గా రాణిస్తూనే నటిగానూ మెప్పిస్తుంది. యాంకర్‌గా టీవీ షోలో గ్లామర్‌ని వడ్డిస్తూ, సినిమాల్లో మాత్రం అద్భుతమైన నటనతో మెప్పిస్తుంది. ప్రస్తుతం ఆమె `పుష్ప` చిత్రంలో నటిస్తుంది. ఇందులో దాక్షాయణి పాత్రలో కనిపించబోతుంది అనసూయ. ఆమె పాత్రలో నెగటివ్‌ షేడ్స్ ఉంటాయని తెలుస్తుంది. దీంతోపాటు చిరంజీవి `ఆచార్య`లో, రవితేజ `ఖిలాడీ`, గోపీచంద్‌ `పక్కా కమర్షియల్‌`, `రంగమార్తాండ`తోపాటు మలయాళంలో `భీష్మ పర్వం` సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. టీవీలో `జబర్దస్త్` షోకి యాంకర్‌గా చేస్తుంది అనసూయ. ఈ షోకి గ్లామర్‌ని అద్దుతూ రక్తికట్టించడంలో ముందుంటుంది. పొట్టిడ్రెస్సుల్లో హోయలు పోతూ ఆకట్టుకుంటుంది. దీంతోపాటు `మాస్టర్‌ చెఫ్‌` అనే వంటల ప్రోగ్రామ్‌కి కూడా హోస్ట్ గా చేస్తుంది అనసూయ. 

also read: SUNIL-PUSHPA : ఇండస్ట్రీకి వచ్చిందే విలన్ అవ్వాలని : సునిల్
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌