
యాంకర్ అనసూయ భరద్వాజ్ కామెడీ షో, ప్రీ రిలీజ్ ఈవెంట్లతోపాటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. మధ్య మధ్యలో తన గ్లామరస్ ఫొటోలు పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తోంది. గతేడాది 'పుష్ప: ది రైజ్'లో దాక్షాయణిగా మంచి నెగెటివ్ పాత్రలో అలరించటంతో ఒక్కసారిగా ఆమె క్రేజ్ రెట్టింపు అయ్యింది.
అలాగే అంతకు ముందు రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.ఇక ఈ సినిమాతో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఈమె వరుస సినిమా అవకాశాలను దక్కించుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో వరస చిత్రాలతో బిజీగా మారిపోయారు.ఇక తాజాగా అనసూయ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో కూడా నటిస్తోంది.
కొరటాల శివ దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి తో పాటు, రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమా ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో యాంకర్ అనసూయ కీలకపాత్రలో నటించారని సమాచారం.అనసూయ ఈ సినిమా కథని మొత్తం కీలక మలుపు తిప్పే పాత్రలో నటించినట్లు తెలుస్తుంది.
ఇలా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన అనసూయ రెమ్యూనరేషన్ విషయంలో కూడా భారీగా డిమాండ్ చేశారని చెప్పుకుంటున్నారు.తక్కువ కాల్షీట్స్ ఇచ్చినప్పటికీ రెమ్యూనరేషన్ మాత్రం పాతిక లక్షలు డిమాండ్ చేశారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఈ విధంగా అనసూయ పాతిక లక్షలు డిమాండ్ చేయడంతో ఆమె కథకు ప్రాధాన్యత ఉండటం వల్ల నిర్మాతలు ఈమె అడిగిన రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు చెప్తున్నారు. అందులో నిజమెంత అనేది ప్రక్కన పెడితే హఠాత్తుగా ఈ కథనాలు రావటం ఎందుకూ అంటే...అనసూయ రెమ్యునేషన్ ఇంత అని ఆమెను సంప్రదిస్తున్న నిర్మాతలకు చెప్పటానికి అంటున్నారు. ఆమెకు బాగా తెలుసున్న మీడియా ద్వారానే ఈ డిటేల్స్ బయిటకు వచ్చాయంటున్నారు. అదే నిజమైతే అనసూయది మంచి స్ట్రాటజీనే మరి. లేకపోతే ఇది ఊహా కల్పనే.