ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి రిలీజ్ కు రెడీ అవుతున్నట్లు సమాచారం. థియోటర్ రిలీజ్ కన్నా ఓటిటినే బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చి మంచి రేటుకు ఇచ్చేసినట్లు సమాచారం.
వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. ఈ చిత్రం ఎలక్షన్స్ లో YSR కాంగ్రేస్ పార్టి ప్రచారానికి,గెలుపుకు ఉపయోగపడింది. అటువంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు మహీ వి. రాఘవ్ ఇటీవల కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. ‘సిద్దా.. లోకం ఎలా ఉంది నాయనా’ టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం లోకం తీరు ఎలా ఉంది? అనే అంశంపై సెటైర్‌గా ఈ చిత్రకథాంశం ఉంటుంది. లేడీ ఓరియంటెడ్ కథగా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ లీడ్ రోల్ చేస్తున్నారు. ‘జెర్సీ’, ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు శ్రద్ధ. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి రిలీజ్ కు రెడీ అవుతున్నట్లు సమాచారం. థియోటర్ రిలీజ్ కన్నా ఓటిటినే బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చి మంచి రేటుకు ఇచ్చేసినట్లు సమాచారం. ఈ మేరకు త్వరలోనే ప్రకటన వచ్చే అవకాసం ఉంది. డిజిటల్ రిలీజ్ కు మంచి రేటు వచ్చినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. వైఎస్ పాత్రలో మలయాళ హీరో మమ్ముట్టి చక్కగా ఒదిగిపోయారు. మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 ఫిబ్రవరి 8న విడుదలై మంచి విజయం అందుకుంది. ‘యాత్ర’ సినిమాకి సీక్వెల్ ఉంటుందని గతంలోనే ప్రకటించారు మహీ వి. రాఘవ్. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బయోపిక్‌ని రూపొందించాలనుకుంటున్నారని తెలిసింది.
జగన్ జీవితంపై సినిమా అనే వార్త వచ్చినప్పటి నుంచి ఈ ప్రాజెక్టుపై వైఎస్ జగన్ అభిమానుల్లో, రాజకీయ వర్గాల్లో, చిత్రపరిశ్రమలో చర్చలు మొదలయ్యాయి. జగన్ పాత్రలో ఎవరు కనిపిస్తారు? అనేది మరింత ఆసక్తిగా మారింది. ‘జగన్‌గారి పాత్రలో నటించేందుకు నన్ను సంప్రదిస్తే కచ్చితంగా నటిస్తా’ అని తమిళ హీరో సూర్య ఓ ఇంటర్వ్యూలో విలేకరి అడిగితే చెప్పారు. దీంతో సూర్య నటిస్తారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత అజ్మల్ నటిస్తారనే వార్తలూ వచ్చాయి. అయితే తాజాగా జగన్ పాత్రలో బాలీవుడ్ నటుడు, ‘స్కామ్ 1992’ వెబ్ సిరీస్ ఫేమ్ ప్రతీక్ గాంధీ నటించనున్నారనే వార్త ప్రచారంలోకొచ్చింది.