Prabhas Upcoming Film : ప్రభాస్ - మారుతీ సినిమాకు ముహూర్తం అప్పుడే.? ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్..

Published : Apr 04, 2022, 01:08 PM ISTUpdated : Apr 04, 2022, 01:09 PM IST
Prabhas Upcoming Film : ప్రభాస్ - మారుతీ సినిమాకు ముహూర్తం అప్పుడే.? ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్..

సారాంశం

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) అప్ కమింగ్ ఫిల్మ్స్ పై తెలుగు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘రాధే శ్యామ్’తో అలరించిన ప్రభాస్.. డైరెక్టర్ మారుతీతో సినిమా  చేస్తుండగా.. ప్రస్తుతం ఈ మూవీపై క్రేజీ బజ్ వినిపిస్తోంది.  

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ బహుబలి (Bahubali) తర్వాత పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగాడు. అప్పటి నుంచి భారీ చిత్రాలతో ఆడియెన్స్ ను అలరించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా స్టార్ డైరెక్టర్స్ తో క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు. ఇప్పటికే భారీ బడ్జెట్ తో ‘రాధే శ్యామ్’ Radhe Shyam చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దాదాపు నాలుగేండ్లుగా ఈ సినిమాను ప్రభాస్ ఎంతగానో కష్టపడ్డాడు. వాయిదాలు పడుతూ వచ్చిన ఈ చిత్రం మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీ హైప్స్ తో వచ్చిన ఈ పాన్ ఇండియన్ మూవీ ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను పొందింది.

ప్రస్తుతం నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే (Project K)లో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో పాటు అటు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తోనూ ‘సలార్’(Salaar) చిత్రాలను సమానంగా తెరెక్కిస్తున్నారు. ఇప్పటికే మైథాలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’ చిత్ర షూటింగ్ ను ప్రభాస్ పూర్తి చేసుకున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

 

అయితే ఈ చిత్రాలతో పాటు గతంలో కమర్షియల్ డైరెక్టర్ మారుతీ (Maruthi)తో కలిసి ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుంది. ఈ మూవీకి సంబంధించిన క్రేజీ బజ్ వినిపిస్తోంది. ఈ నెల 10న ప్రభాస్ - మారుతీ కాంబోలోని చిత్రానికి ముహుర్తం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లోనే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా స్టార్ట్ చేయబోతున్నట్టు గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఇక ‘రాజా డీలక్స్’ పేరును తొలుత ఈ చిత్రానికి టైటిల్ గా పరిశీలించారు. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?