అనన్య నాగళ్ల కోసం అనసూయ, పాయల్‌.. `తంత్ర` మొదటి పాట విడుదల..ఎలా ఉందంటే?

Published : Jan 13, 2024, 12:25 AM ISTUpdated : Jan 13, 2024, 12:28 AM IST
అనన్య నాగళ్ల కోసం అనసూయ, పాయల్‌.. `తంత్ర` మొదటి పాట విడుదల..ఎలా ఉందంటే?

సారాంశం

అనన్య నాగళ్ల ఇప్పుడు నెమ్మదిగా ఒక్కో సినిమా చేస్తూ మెరుస్తుంది. మెప్పిస్తుంది.ఆమె హీరోయిన్‌గానూ ఆకట్టుకుంటుంది. తాజాగా `తంత్ర` చిత్రంతోరాబోతుంది. 

`వకీల్‌సాబ్‌`తో మంచి గుర్తింపు తెచ్చుకుంది అనన్య నాగళ్ల. ఇందులో ఇన్నోసెంట్‌ తెలంగాణ అమ్మాయిగా మెరిసింది. ఈ సినిమా తర్వాత ఒకటి రెండుసినిమాల్లో మెరిసింది. ఇప్పుడు `తంత్ర` అంటూ వస్తోంది. ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా ఓ అప్‌ డేట్‌ ఇచ్చాడు. అనన్య నాగళ్ళ, ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశి, మీసాల లక్ష్మణ్ ముఖ్య పాత్రల్లో నటించిన `తంత్ర` చిత్రానికి శ్రీనివాస్‌ గోపీశెట్టి దర్శకత్వం వహించారు. ఈ మూవీనుంచి తాజాగా తొలి పాటని విడుదల చేశారు. `ధీరే ధీరే `అంటూ సాగే పాట యాంకర్‌ అనసూయ, నటిపాయల్ రాజ్‌పుత్‌ విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి మాట్లాడుతూ : గతంలో మేం రిలీజ్ చేసిన ఫస్ట్-లుక్‌ కి చాలా మంచి స్పందన లభించింది. తర్వాత టీజర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ కామెంట్స్ ఇస్తూ, డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్ అని మెచ్చుకోవడం మాకు మంచి ధైర్యాన్నిస్తోంది. అతి త్వరలో ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నాం. ట్రైలర్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ రివీల్ అవుతాయి. మా ప్రొడ్యూసర్స్ నరేష్ బాబు మరియు రవిచైతన్య ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా అడిగింది వెంటనే ఏర్పాటు చేస్తూ చాలా బాగా సహకరించారు. గతంలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన అనురాగ్ కులకర్ణి ఈ సాంగ్ పాడడం సాంగ్ కి చాలా ప్లస్ అయ్యింది. ఎంతో బిజీగా ఉన్నా కూడా అడగగానే కాదనకుండా ఈ సాంగ్ రిలీజ్ చేసిన పాయల్ రాజ్‌పుత్ గారికి, అనసూయకి ప్రత్యేక కృతజ్ఞతలు దర్శకుడు తెలియజేసాడు.

ప్రొడ్యూసర్స్ మాట్లాడుతూ : ఫస్ట్-లుక్, టీజర్‌కి వస్తున్న ఆదరణ మాకు చాలా ఉత్సాహాన్నిచ్చింది. ఇలాగే ప్రేక్షకుల ఆదరణ మా తంత్ర సినిమా పైన, మా పైన ఉండాలని.. సినిమాను మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ సాంగ్ రిలీజ్ చేసిన పాయల్ రాజ్‌పుత్, అనసూయ గార్లకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

నటీనటులు :
అనన్య నాగళ్ళ, ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశి, మీసాల లక్ష్మణ్, కుషాలిని, మనోజ్ ముత్యం, శరత్ బరిగెల

టెక్నీషియన్స్ :
రచన మరియు దర్శకత్వం : శ్రీనివాస్ గోపిశెట్టి
నిర్మాణం: ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరి
నిర్మాతలు : నరేష్ బాబు పి, రవి చైతన్య
సహ నిర్మాత : తేజ్ పల్లి
డిఓపి : సాయిరామ్ ఉదయ్, విజయ భాస్కర్ సద్దాల
ఆర్ట్ డైరెక్టర్: గురుమురళీ కృష్ణ
ఎడిటర్ : ఎస్ బి ఉద్ధవ్
మ్యూజిక్ : ఆర్ ఆర్ ధృవన్
సౌండ్ డిజైన్: జ్యోతి చేతియా
సౌండ్ మిక్సింగ్: శ్యామల్ సిక్దర్
VFX: ఎ నవీన్
DI కలరిస్ట్: పివిబి భూషణ్
సాహిత్యం: అలరాజు
పి ఆర్ ఓ : మధు VR
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?