నమ్రతా వైరల్ పోస్ట్.. మహేశ్ బాబు - వైఎస్ జగన్ వీడియోను పోస్ట్ చేసి.. డిలీట్! నెట్టింట చర్చ

Published : Jan 12, 2024, 09:11 PM ISTUpdated : Jan 12, 2024, 09:13 PM IST
నమ్రతా వైరల్ పోస్ట్.. మహేశ్ బాబు - వైఎస్ జగన్ వీడియోను పోస్ట్ చేసి.. డిలీట్! నెట్టింట చర్చ

సారాంశం

నమ్రతా శిరోద్కర్ Namrata Shirodkar తాజాగా ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. మహేశ్ బాబు మరియు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన మూచ్యువల్ వీడియోను పంచుకోవడం నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారింది. 

సూపర్ స్టార్ మహేశ్ బాబు Mahesh Babu లేటెస్ట్ ఫిల్మ్ ‘గుంటూరు కారం’ Guntur Kaaram ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ Trivikram దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే సినిమాకు ఆశించిన స్థాయిలో రివ్యూ దక్కలేదు. కానీ మహేశ్ ను అభిమానించే వారికి మాత్రం ఈ మూవీ ఫీస్ట్ అనే చెబుతున్నారు. ఏదేమైనా సంక్రాంతికి ‘గుంటూరు కారమే’ పెద్ద సినిమాగా నిలుస్తోంది.

ఈ సినిమా సంగతి అటంచితే... మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ Namrata Shirodkar  తాజాగా ఓ ఆసక్తికరమైన వీడియోను తన అఫీషియల్ ఇన్ స్టా గ్రామ్ స్టోరీ హ్యాండ్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఏంటంటే... మహేశ్ బాబు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి YS Mohan Reddy కి సంబంధించిన మూచ్యువల్ వీడియోను షేర్ చేసింది. అలాగే ‘గుంటూరు కారం’లోని ‘దమ్ మసాలా’ సాంగ్ ను కూడా జతచేసి పోస్ట్ పెట్టింది. 

దీంతో ఘట్టమనేని ఫ్యామిలీ, వైఎస్ ఫ్యామిలీ మధ్య ఎప్పటికీ మంచి బాండింగ్ ఉంటుందని ఇరువైపులా అభిమానులు చెబుతున్నారు. ఇటీవల మహేశ్ మా బాబు అంటూ కొందరు టీడీపీ ఫ్యాన్స్ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారని, నమ్రతా పెట్టిన వీడియోతో ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి నమ్రతా పెట్టిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 45 నిమిషాల వరకు ఆ పోస్ట్ ను ఉంచి డిలీట్ చేసింది.

ఇక ‘గుంటూరు కారం’ సినిమాను ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మహేశ్ బాబు మాస్ ట్రీట్ కు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా బాబు డాన్స్, శ్రీలీలా దుమ్ములేపే పెర్ఫామెన్స్, థమన్ మ్యూజిక్ కు థియేటర్లలో రచ్చరచ్చ చేస్తున్నారు. ఇక ఈరోజు అభిమానులతో కలిసి మహేశ్ బాబు, నమత్రా, ఇద్దరు పిల్లలు థియేటర్ లో సినిమా వీక్షించారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?