డైరెక్టర్ తో రొమాన్స్ పై అనసూయ కామెంట్స్!

Published : Jan 31, 2019, 09:39 AM IST
డైరెక్టర్ తో రొమాన్స్ పై అనసూయ కామెంట్స్!

సారాంశం

'పెళ్లిచూపులు' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన తరుణ్ భాస్కర్ ఇప్పుడు పూర్తిస్థాయి నటుడిగా సినిమా చేయబోతున్నాడు. విజయ్ దేవరకొండ ఈ సినిమాను నిర్మిస్తుండడం విశేషం. 

'పెళ్లిచూపులు' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన తరుణ్ భాస్కర్ ఇప్పుడు పూర్తిస్థాయి నటుడిగా సినిమా చేయబోతున్నాడు. విజయ్ దేవరకొండ ఈ సినిమాను నిర్మిస్తుండడం విశేషం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ సరసన హీరోయిన్ గా అనసూయ నటించబోతుందని, సినిమాలో ఆమె పాత్ర చాలా గ్లామరస్ గా ఉంటుందని, తరుణ్ భాస్కర్ తో రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉంటాయని ప్రచారం జరిగింది.

ఈ వార్తలపై స్పందించిన అనసూయ సినిమాలో నటిస్తున్న మాట నిజమే కానీ.. రొమాంటిక్ పాత్ర కాదని స్పష్టం చేసింది. ఆ పాత్ర తన కెరీర్ ని మరింతగా ముందుకు తీసుకువెళ్లేలా ఉంటుందని అనసూయ  చెప్పుకొచ్చింది.

త్వరలోనే సినిమా ప్రారంభమవుతుందని అప్పుడు తన పాత్ర గురించి క్లారిటీ ఇస్తానని వెల్లడించింది. ప్రస్తుతం అనసూయ 'కథనం' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె సహాయ దర్శకురాలి పాత్రలో కనిపించబోతుందని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి ఇండస్ట్రీకి మొగుడవుతాడని ముందే చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Boyapati Movies:పవన్ మూవీతో పోటీ పడి అట్టర్ ఫ్లాప్ అయిన బోయపాటి సినిమా ఏంటో తెలుసా.. రెండింటిపై భారీ అంచనాలు