హైపర్ ఆది.. కోరి సమస్యలు తెచ్చుకుంటున్నాడా?

Published : Jan 31, 2019, 08:08 AM IST
హైపర్ ఆది.. కోరి సమస్యలు తెచ్చుకుంటున్నాడా?

సారాంశం

బుల్లి తెరపై ఎన్ని విన్యాసాలు చేసినా, ఎంత ఘన విజయం సాధించినా పెద్ద తెరపై కనపడితే ఆ కిక్కే వేరు. అందుకే టీవిల్లో టాప్ స్దాయికి వెళ్లినా వెండితెరపై కనపడటానికి తహతహలాడుతారు.

బుల్లి తెరపై ఎన్ని విన్యాసాలు చేసినా, ఎంత ఘన విజయం సాధించినా పెద్ద తెరపై కనపడితే ఆ కిక్కే వేరు. అందుకే టీవిల్లో టాప్ స్దాయికి వెళ్లినా వెండితెరపై కనపడటానికి తహతహలాడుతారు. అదే రూటులో  జబర్దస్త్ టీమ్ కూడా ప్రయాణం పెట్టుకుంది. ధన్ రాజు, వేణు, చమ్మక్ చంద్ర వంటి వారు అప్పుడప్పుడూ తెరపై కనపడుతున్నా..పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి.  అయితే తన పంచ్ డైలాగులతో జబర్దస్త్ లో  సూపర్ సక్సెస్ అయిన  హైపర్ ఆది...మాత్రం మంచి స్దాయికు చేరుతారు అనుకున్నారు.  ఈ మేరకు ఆఫర్స్ సైతం బాగానే వస్తున్నాయి. అయితే అవేమీ కలిసిరావటం లేదు.

హైపర్ ఆది... ఆ మ‌ధ్య అల్ల‌రి న‌రేష్ మేడ మీద అబ్బాయి సినిమాలో న‌టించాడు.ఆ సినిమా ఫ్లాప్. దానికి క‌థా స‌హ‌కారం కూడా అందించాడు. ఇక ఆ త‌ర్వాత చేసిన వ‌రుణ్ తేజ్ తొలిప్రేమ‌ హిట్ అయినా కూడా పెద్ద‌గా క‌లిసి రాలేదు.  ఈ మధ్యలో చేసిన ఆట కదరా శివ..అసలు రిలీజైన విషయమే జనాలకు గుర్తు లేదు.  ఇక  రీసెంట్ గా విడుద‌లైన అఖిల్ చిత్రం మిస్టర్ మ‌జ్ను సినిమా ఫ్లాప్ కావ‌డంతో మ‌రోసారి ఆదికి నిరాశ త‌ప్ప‌లేదు. 

దానికి తోడు పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన ఆది జనసేన పార్టికి సపోర్ట్ చేస్తున్నారు. జనసేన కు  సపోర్ట్ చేయటంలో ఇబ్బంది లేదు కానీ.. అనఫషీయిల్ స్పోక్స్ పర్సన్ లా మారాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి.  దాంతో ఇండస్ట్రీలోని కొన్ని వర్గాలకు ఆయన దూరం అవుతున్నారు. వాళ్లు ఆదిని ఎంకరేజ్ చేయటానికి ఇష్ట పడలేదు. అంతేకాకుండా ఆదిని పెట్టుకుందామనుకునే వారిని కూడా డిస్కరేజ్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆది సినీ కెరీర్ పై పడే అంశమే. 

దాంతో ఆది డైలాగులను జబర్దస్త్ లో ఎంజాయ్ చేస్తున్నారు కానీ , సినిమాలో అవే సెటైర్స్ పేలటం లేదని  ప్రచారం మొదలైంది. మరి ఈ సమస్యలను ఆది ఎలా ఎదుర్కొంటారో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Jason Sanjay: దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ లవ్ బ్రేకప్ స్టోరీ.. అసలేం జరిగిందంటే?
Bigg Boss 10 Wild Card Entry: వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వచ్చేది వీళ్లే.. ఇప్పుడే అసలు మజా