చెర్రీకి అనసూయ రుచులు చూపిస్తుందట

Published : Oct 19, 2017, 05:59 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
చెర్రీకి అనసూయ రుచులు చూపిస్తుందట

సారాంశం

బుల్లితెరపై సక్సెస్ ఫుల్ యాంకర్ గా పేరుతెచ్చుకున్న అనసూయ అనసూయ పేరుతో సాయిధరమ్ తేజ్ సినిమాలో ఐటమ్ సాంగ్ తాజాగా మెగా పవర్ స్టార్ రంగస్థలం సినిమాలోనూ అనసూయ షూటింగ్ సందర్భంగా చెర్రీ,సుక్కులకు హోమ్ మేడ్ ఫుడ్ ఆఫర్ చేసిన అనసూయ

తెలుగు బుల్లితెరపై కనిపించే టాప్ యాంకర్లలో అనసూయ ముందు వరుసలో వుంటుంది. రకరకాల టీవీ షోలతో, తన అందం అభినయంతో... ప్రేక్షకులను కట్టిపడేసే టాలెంట్ అనసూయ సొంతం. డబుల్ మీనింగులతో హాట్ హాట్ గా వుండే కామెడీని చూపించే ‘జబర్ధస్త్’ షో తో ఎంట్రీ ఇచ్చిన అందాల యాంకర్ అనసూయ.. గిలిగింతలు పెట్టే మాటలతో.. హాట్ హాట్ డ్రెస్సింగ్ తో.. కుర్రకారు మతులు పోగొడుతూ వుంటుంది. చాలా తక్కువ టైమ్ లో ఎక్కువ పాపులారిటీ సంపాదించింది. దీంతో వివిధ ఛానల్స్ లో యాంకరింగ్ చేస్తూ.. ప్రైవేట్ ప్రోగ్రామ్స్ లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ బాగానే సంపాదిస్తోంది.

 

‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రంలో నాగ్ సరసన నటించిన ఈ అమ్మడు ఈ మద్య విన్నర్ లో సుయ సుయ అంటూ తన పేరుపై వచ్చిన ఐటమ్ సాంగ్ లో స్టెప్పులేసింది.  తాజాగా రామ్ చరణ్ నటిస్తున్న రంగస్థలం 1985 చిత్రంలో నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది.  తాజాగా షూటింగ్ సందర్భంగా అనసూయ తన వంటకాలతో హీరో రాంచరణ్, దర్శకులు సుకుమార్ లను మెప్పించిందట.   

 

రంగస్థలం 1985 చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అప్పుడే తన వంటల రుచి ఎలా ఉంటుందో వండి వడ్డించి మరీ చూపిస్తానని మాటిచ్చిందట. ఇంకేముంది అనసూయ ఇచ్చిన ఆఫర్ కు చరణ్ సై అన్నాడు, అనసూయ తెచ్చే వంటకాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడట. చెర్రీతోపాటు దర్శకులు సుకుమార్ కి కూడా ఈ ఆఫర్ వుందట. 

 

దీంతో అనసూయ ఏమేం టేస్ట్ చూపించబోతుందోనని ఎదురుచూస్తున్నారు. అనసూయ హాట్ గా నటించడమే కాదు మంచి వంటకారి అని పలు షోలలో చెప్పడం చూశాం. యాంకర్ గా హాట్ ఇమేజ్ సొంతం చేసుకున్న అనసూయ.. వెండితెర పై కూడా అదేలా క్రేజ్ రావటం కోసం తెగ ట్రై చేస్తోంది. మరి రంగస్థలంతో ఎలాంటి ఇమేజ్ వస్తుందో, ఏ రేంజ్ కు వెళ్తుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

సీజన్ 9లో భరణి అన్ అఫీషియల్ విన్నర్, నాగబాబు రెకమండేషన్ ఇలా వర్కౌట్ అయిందా.. మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్
Karthika Deepam 2 Latest Episode: దీపను బ్రతిమాలిన శ్రీధర్- స్వప్న, కాశీలను కలిపిన కార్తీక్