Anasuya Mega Movie: మరోసారి మెగా సినిమా ఛాన్స్ కొట్టేసిన అనసూయ

Published : Feb 16, 2022, 01:55 PM ISTUpdated : Feb 16, 2022, 01:57 PM IST
Anasuya Mega Movie: మరోసారి మెగా సినిమా ఛాన్స్ కొట్టేసిన అనసూయ

సారాంశం

అటు యాంకర్ గా.. ఇటు యాక్ట్రస్ గా ఖాళీ లేకుండా గడిపేస్తోంది అనసూయ. వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది. వరుసగా మెగా సినిమాలు చేస్తున్న ఈ జబర్ధస్త్ యాంకర్ కు మరో జబర్ధస్త్ ఆఫర్ వరించినట్టు తెలుస్తోంది.

అటు యాంకర్ గా.. ఇటు యాక్ట్రస్ గా ఖాళీ లేకుండా గడిపేస్తోంది అనసూయ. వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది. వరుసగా మెగా సినిమాలు చేస్తున్న ఈ జబర్ధస్త్ యాంకర్ కు మరో జబర్ధస్త్ ఆఫర్ వరించినట్టు తెలుస్తోంది.

 బుల్లితెరపై .. వెండితెరపై  దూసుకు పోతోంది యాంకర్ అనసూయ. రెండు వైపుల నుంచి ఆమకు  ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. స్పెషల్ సాంగ్స్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. రాను రాను గ్లామరెస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సాధించింది అనసూయ.

 ముఖ్యంగా రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర అనసూయకు మంచ పేరు తీసుక వచ్చింది. ఇక ఏ క్యారెక్టర్ పడితే..ఆ క్యారెక్టర్ చేయకుండా.. తనకు స్పెషల్ ఇమేజ్ ఇచ్చే పాత్రలను ఎంచుకుని మరీ చేస్తుంది స్టార్ యాంకర్. ఈ క్రమంలోనే చాలా సినిమాలో చాలా క్యారెక్టర్స్ చేసింది. ఎక్కువగా మెగా హీరోల సినిమాల్లో కనిపిస్తోంది అనసూయ.


 రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో అదరగొట్టి వంద మార్కులు వేయించుకుంది అనసూయ.. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఖిలాడి  సినిమాలో చేసిన చంద్రకళ పాత్ర జనాల్లో ఆమె ఇమేజ్ ను ఇంకా పెంచింది. ఆమెకి మరింత మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఇక చిరంజీవి ఆచార్య సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన అనసూయ, మరోసారి ఆయన సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వస్తున్నాయి.

మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి భోళాశంకర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమా పట్టాలెక్కేసింది. ఈసినిమాలో కూడా ఒక డిఫరెంట్ రోలో ఉంది అని తెలిసింది. ఈ రోల్ కోసం అనసూయను తీసుకున్నారని సమాచారం. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగులో ఆమె జాయిన్ అవుతుందని చెబుతున్నారు. ఆ పాత్ర గురించిన వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sobhan Babu `సోగ్గాడు` మూవీతో పోటీ పడి దెబ్బతిన్న ఎన్టీఆర్‌.. శివాజీ గణేషన్‌కైతే చుక్కలే
Illu Illalu Pillalu Today: వల్లి పెట్టిన చిచ్చు, ఘోరంగా మోసపోయిన సాగర్, భర్త చెంప పగలకొట్టిన నర్మద