Pawan Kalyan:అజిత్ డైరక్టర్ తో పవన్ నెక్ట్స్ ...స్టోరీ లైన్ సమ్ థింగ్ స్పెషల్

Surya Prakash   | Asianet News
Published : Feb 16, 2022, 01:37 PM IST
Pawan Kalyan:అజిత్ డైరక్టర్ తో పవన్ నెక్ట్స్ ...స్టోరీ లైన్ సమ్ థింగ్ స్పెషల్

సారాంశం

"వకీల్ సాబ్" తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు "భీమ్లా నాయక్" సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు చాలా ప్రాజెక్టులు ఉన్నాయి.  

పవన్ కల్యాణ్ వరస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడా గ్యాప్ అనేది ఇవ్వదలుచుకోలేదు. రోజూ కథలు వినటం, నచ్చితే పట్టాలు ఎక్కించటం చేస్తున్నారు. దాంతో ఆయనతో సినిమా చేద్దామనుకున్న డైరక్టర్స్ అంతా కథలతో క్యూలు కడుతున్నారు. కేవలం తెలుగు నుంచే కాదు తమిళం నుంచి కూడా కథలతో పవన్ దగ్గరకు వెళ్తున్నాడు. తాజాగా అజిత్ తో సినిమా చేసిన దర్శకుడుతో పవన్ సినిమా ఉండబోతోందని సమాచారం. ఎవరా దర్శకుడు అంటే...

ఆ తమిళ్ డైరెక్టర్ మరెవరో కాదు త్వరలో విడుదల కాబోతున్న హెచ్ వినోద్. ఆయన అజిత్ హీరోగా డైరక్ట్ చేసిన "వాలిమై" సినిమా తమిళంలోనే కాక తెలుగులో కూడా విడుదల కాబోతోంది.   ఈ సినిమా ట్రైలర్స్ చూసిన పవన్ కళ్యాణ్ చాలా ముచ్చటపడి ఫోన్ చేసి కథ చెప్పమన్నారని వినికిడి. దాంతో వినోద్ వెంటనే స్పందించి ఓ కథతో పవన్ ని కలవటం జరిగిందిట.  ఆ స్టోరీ లైన్ కూడా ఓకే అయ్యిందని ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోందని చెప్తున్నారు.

 ఆ విధంగా వినోద్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఇంతకుముందు హెచ్ వినోద్ డైరెక్ట్ చేసిన తమిళ సినిమా "నేర్కొండ పార్వై" బాలీవుడ్ లో "పింక్" సినిమాకి రీమేక్ గా విడుదలైంది. అదే "పింక్" సినిమాని పవన్ కళ్యాణ్ కూడా "వకీల్ సాబ్" గా తెలుగులో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఈ సినిమాలో పవన్ పాత్ర పూర్తి యాక్షన్ తో కనిపించే గ్యాంగస్టర్ గా ఉంటుందని, అయితే ఆ పాత్ర వెనక సామాజిక కార్యకర్త కనిపిస్తాడని అంటున్నారు.  ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

ఇక "వకీల్ సాబ్" తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు "భీమ్లా నాయక్" సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ మరిన్ని సినిమాలు సైన్ చేస్తూ అందరికీ ఆశ్చర్య పరుస్తున్నారు పవన్ కళ్యాణ్.  

ఇక ఇప్పటికే విడుదలైన ‘వలీమై’ సినిమా ట్రైలర్ విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా తెలుగు హీరో కార్తికేయ కూడా తన లుక్‌తో అదరగొట్టారు. ఇక అజిత్ లుక్ కేకపెట్టించే విధంగా ఉంది. అజిత్ ఫ్యాన్స్ కోరుకున్న విధంగానే ట్రైలర్ గ్రాండ్ విజువల్స్‌తో అదిరిపోయింది. ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. అజిత్‌తో ఆయనకు రెండో చిత్రమిది. ఈ సినిమాలో అజిత్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sobhan Babu `సోగ్గాడు` మూవీతో పోటీ పడి దెబ్బతిన్న ఎన్టీఆర్‌.. శివాజీ గణేషన్‌కైతే చుక్కలే
Illu Illalu Pillalu Today: వల్లి పెట్టిన చిచ్చు, ఘోరంగా మోసపోయిన సాగర్, భర్త చెంప పగలకొట్టిన నర్మద