
తమిళ్ తో పాటు తెలుగులో కూడా దూసుకుపోతున్నాడు స్టార్ హీరో సూర్య. రీసెంట్ గా రెండు హిట్ సినిమాలు అందుకున్న అరవ హీరో.. ఇప్పుడు ముచ్చటగా మూడో హిట్ మీద కన్నేశాడు.
తమిళ హీరో సూర్య తెలుగులో కూడా దడదడలాడిస్తున్నాడు. తమిళంలో తెరకెక్కుతున్న ప్రతీ సీనిమయాను డబ్బింగ్ ద్వారా తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ.. ఇక్కడ కూడా హిట్స్ అందుకుంటున్నారు. ఆమధ్య మనోడు చేసిన రెండు సినిమాలు రెండు భాషల్లో హిట్ అయ్యాయి. ఆకాశమే ని హద్దురా తో పాటు.. జై భీమ్ కూడా రి కార్డ్ క్రియేట్ చేసింది. ఇక ప్రస్తుతం తమిళ్ లో ఇతరుక్కుమ్ తునింధవన్ అనే సినిమా చేస్తున్నాడు సూర్య.
అయితే తమిళంలో రూపొందుతున్న ఈసినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయబోతున్నాడు. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మార్చి 10న ప్రపంచ వ్యాప్తంగా రీలీజ్ కు రెడీ అవుతుంది. తెలుగుతో పాటు మలయాళ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ సినిమాను ఈటి అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు.
ఇక తాజాగా ఈ సినిమా నుంచి తెలుగు లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు టీమ్. సిలుకు జుబ్బా స్మార్టు .. పెట్టేశావే స్పాటు .. పొడవకురో గుండెల్లోనా పోట అంటూ సాగే ఈ పాట ను ఇమాన్ స్వరపరిచగా.. ఈపాటకి వనమాలి సాహిత్యాన్ని అందించారు హరిచరణ్, శ్రీనిధి కలిసి అద్భుతంగా ఈ పాటను ఆలపించారు. సూర్య, ప్రియాంక మోహన్ పై చిత్రీకరించిన ఈ పాటకి జానీ మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు.
ఈ పాట ఎక్కువగా మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఫాస్టు బీట్. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో, సత్యరాజ్ ,శరణ్య,రాజ్ కిరణ్ ,సూరి ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే గతంలో రెండు హిట్ సినిమాలు ఓటీటీ ద్వారా రిలీజ్ చేసిన సూర్య.. చాలా లాంగ్ గ్యాప్ తరువాత థియేటర్స్ కి వస్తున్నాడు. మరి ఈ సినిమాతో సూర్యకు హ్యాట్రిక్ హిట్ లభిస్తుందా లేదా అనేది చూడాలి.