‘రంగస్థలం’ డైలాగ్స్ లీక్ చేస్తున్న అనసూయ..నిజమే?

Published : Sep 05, 2017, 05:23 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
‘రంగస్థలం’ డైలాగ్స్ లీక్ చేస్తున్న అనసూయ..నిజమే?

సారాంశం

రామ్ చరణ్ మూవీలో అనసూయ కీలక పాత్ర రంగస్థలం మూవీ డైలాగ్స్ లీక్ చేస్తున్న అనసూయ ‘రంగస్థలం’ సినిమాకు   బ్రాండ్ అంబాసిడర్ గా మారిన అనసూయ

హాట్ యాంకర్ అనసూయ... రామ్ చరణ్, సుకుమార్ ల కాంబినేషన్ లో రూపొందింపబడుతున్న ‘రంగస్థలం’ మూవీలో ఒక కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమాలోని ఆమె పాత్ర స్వభావం ఏమిటో తెలియకపోయినా ఆసినిమాలోని డైలాగ్స్ ను బయట పెడుతూ అనసూయ ప్రస్తుతం హడావిడి చేస్తోంది. 

 

‘నింద నిజం అయితే తప్పు దిద్దుకో అబద్ధం అయితే నవ్వేసి ఊరుకో’ అనే డైలాగ్ ‘రంగస్థలం’ సినిమాలో ఉంది అంటూ అనసూయ సోషల్ మీడియాలో బయట పెట్టింది. అయితే ఈ డైలాగ్ తాను చెప్పిందా లేకుంటే రామ్ చరణ్ లేదా సమంత చెప్పిందా అన్న విషయం పై క్లారిటీ లేదు. 

 

అనసూయ బయట పెట్టిన ఈ డైలాగ్ అద్భుతంగా ఉంది అంటూ మెగా అభిమానులు ఆమెను తెగ పోగుడ్తున్నారు. అయితే ఆమె వ్యతిరేకులు మాత్రం.. ఈమధ్య కాలంలో ‘అర్జున్ రెడ్డి’ సినిమా పై ముఖ్యంగా విజయ్ దేవరకొండ పై ఈమె చేసిన ఘాటైన విమర్శల నుండి వస్తున్న వివాదాలను తప్పించుకోవడానికి అనసూయ ఈవిధంగా ‘రంగస్థలం’ డైలాగ్ ను వాడుకుంటోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.  

 

విమర్శలు ఎన్ని వచ్చినా తాను తట్టుకుంటూ చిరునవ్వులు చిందించగలను అని చెప్పడానికే అనసూయ ‘రంగస్థలం’ డైలాగ్ ను తెరపైకి తీసుకు వచ్చింది అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కారణాలు ఏమైనా అనసూయ ‘రంగస్థలం’ సినిమాకు ముఖ్యంగా ఆసినిమాలోని డైలాగ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తూ మెగా అభిమానుల మన్ననలను పొందుతోంది..

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే