
ఆర్ ఆర్ ఆర్ మూవీ(RRR Movie)లో చరణ్ ఇంట్రో సీన్ హైలెట్ అని చెప్పాలి. ఒక్క డైలాగ్ చెప్పకుండా కేవలం యాక్షన్ తో చరణ్ సీన్ పండించారు. వేయి మందితో ఓ పోలీస్ తలపడితే ఎలా ఉంటుందో చాలా సహజంగా ఉత్కంఠరేగేలా చిత్రీకరించారు. అయితే ఆ సన్నివేశం చిత్రీకరణ సమయంలో రామ్ చరణ్ ని చూసి రాజమౌళి సైతం భయపడ్డారట. వేయి మంది ఒక్కసారిగా చరణ్ వైపు దూసుకురావడంతో ఆ ఏరియా మొత్తం దుమ్ముతో అల్లుకుపోయిందట. ఆ డస్ట్ లో చరణ్ కనిపించలేదట. ఆయనకు ఏమైందో అని రాజమౌళి కంగారు పడగా... చిన్న గీత కూడా పడకుండా చరణ్ బయటపడ్డారట.
ఇక ఆ ఇంట్రో సన్నివేశం కోసం మూడు నెలలు వర్క్ చేసిన టీమ్... 15 రోజుల పాటు షూట్ చేశారట. రామ్ చరణ్ ఇంట్రో సీన్ కి ప్రేక్షకుల నుండి ప్రసంశలు దక్కుతున్నాయి. ఇక ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ సమయంలో రామ్ చరణ్ (Ram Charan)గాయపడ్డారు. దీనితో కొన్ని రోజుల పాటు షూటింగ్ ఆగిపోయింది. మరోవైపు ఎన్టీఆర్ కూడా అదే స్థాయిలో ఆర్ ఆర్ ఆర్ కోసం కష్టపడ్డారు. ఎన్టీఆర్(NTR) సైతం ప్రమాదానికి గురయ్యారు. ఆయన చేతికి గాయమైంది. ఇద్దరూ అంతలా కష్టపడ్డారు కాబట్టే ఫలితం ఇంత గొప్పగా ఉంది.
ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 600 కోట్లు దాటేసింది. భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఆర్ ఆర్ ఆర్ మూవీ మొదటివారం ముగియక ముందే బ్రేక్ ఈవెన్ కి చేరువ అవుతుంది. విడుదలైన అన్ని భాషల్లో ఆర్ ఆర్ ఆర్ విపరీతమైన ఆదరణ దక్కించుకుంటుంది.
ఇక ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించారు. కీరవాణి సంగీతం అందించారు. అలియా భట్, ఓలివియా మోరిస్ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీలో అజయ్ దేవ్ గణ్ కీలక రోల్ చేశారు. మొత్తంగా ఆర్ ఆర్ ఆర్ బాహుబలి రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తూ భారీ కలెక్షన్స్ వైపుగా దూసుకుపోతుంది.