
ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు బుల్లితెర లో క్రేజ్ సంపాదిస్తున్న యాంకర్లు కేవలం దానికే పరిమితం కాకుండా వెండి తెరపైనా తమ సత్తా చాటుతున్నారు. అప్పట్లో టాప్ రేంజ్ కెళ్లిన సుమ లాంటి వాళ్లు కూడా ఇప్పుడు కొత్త పంథాలో ముందుకెళ్తున్నారు. టాప్ యాంకర్ సుమ ఓ సాంగ్ పాడింది. జబర్దస్త్ రేష్మి గుంటూరు టాకీస్ లో అందాలు ఆరబోసింది. ఇక మరో క్రేజీ యాంకర్ అనసూయ ఇప్పుడు ఐటమ్ గర్ల్ గా మారింది. తనను అలా అనొద్దంటూనే ఐటమ్ సాంగులో స్టెప్పులేసింది. నాగార్జున సోగ్గాడే చిన్నినాయనాలో మెరిసిన అనసూయ... మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ సరసన స్టెప్పులేసి యమా క్రేజ్ సంపాదించింది.
అనసూయ టీవీ యాంకరింగ్‌కు గ్లామర్ టచ్ ఇచ్చి.. యాంకరింగ్ అంటే సినీ హీరోయన్స్ లా గ్లామర్ చూపించొచ్చని.. స్క్రీన్ ఏదైనా చూపిస్తేనే... జనానికి దగ్గరవొచ్చనే ఫార్ములాను బలంగా నమ్మి సూపర్ పాపులారిటీ సంపాదించేసింది. ఇప్పుడు సినిమా అవకాశాలు కూడా పట్టేసి తన క్రేజ్ మరింత పెంచుకుంటోంది ఈ హాట్ బ్యూటీ.
అనసూయకు నాలుగేళ్ల కిందటే ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో కలిసి స్టెప్పులేసే అవకాశం లభించిందన్న సంగతి తెలిసిందే. ఆ అవకాశాన్ని మరో ఆలోచన లేకుండా వినియోగించుకోవాల్సింది. కానీ అనసూయ ఒప్పుకోలేదు. కారణమేంటి అని అడిగితే.. ఐటెం సాంగ్స్ చేయడం తనకిష్టం లేదని చెప్పింది.
అయితే ఇప్పుడు అనసూయ మాట మార్చేసింది. ‘విన్నర్’ సినిమాలో సూయ సూయ పాటలో సాయిధరమ్‌తో ఆడిపాడాక.. అనసూయ గతంలో ఐటమ్ సాంగ్స్ ఒప్పుకోలేదుగా అంటే అలాంటిదేం లేదని డొంక తిరుగుడుగా మాట్లాడుతోంది . ‘అత్తారింటికి దారేది’ సినిమాలో చేయకపోవటానికి కారణం అది ఐటెం సాంగ్ అని కాదట. అప్పటికి ఆమె ప్రెగ్నెంట్ అని, అందుకే ఆ పాట చేయడానికి ఒప్పుకోలేదని అంటోంది. ‘‘పవన్ కళ్యాణ్‌తో పాటంటే ఎవరు ఒప్పుకోరు చెప్పండి. కానీ అప్పటికి నేను ప్రెగ్నెంట్. వాళ్లు కూడా సింపుల్ స్టెప్పులేనని, ఏం పర్వాలేదని కూడా చెప్పారు. కానీ నేను చేయొద్దనుకున్నా’’ అని ఇప్పుడు చెప్తోంది అనసూయ.
మరి ఇదే అసలు వాస్తవం అయితే పవన్ సినిమాలో ఎందుకు చేయలేదని ఇంతకుముందు అడిగిన్పపుడు.. మరో కారణం ఎందుకు చెప్పిందో.. ‘విన్నర్’లో ఐటెం సాంగ్ చేశాక... పవన్ సినిమాలో స్టెప్పులేయక పోవడానికి కారణం మార్చి చెప్పడం.. అబ్బో... అనసూయ... నీకు నువ్వే సాటి.