#OG: పవన్-సుజీత్ మూవీపై అధికారిక ప్రకటన... దుమ్మురేపిన అనౌన్స్మెంట్ పోస్టర్!

Published : Dec 04, 2022, 09:58 AM IST
#OG: పవన్-సుజీత్ మూవీపై అధికారిక ప్రకటన... దుమ్మురేపిన అనౌన్స్మెంట్ పోస్టర్!

సారాంశం

ఆర్ ఆర్ ఆర్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య నిర్మాతగా పవన్ కళ్యాణ్-సుజీత్ కాంబినేషన్ లో మూవీ తెరకెక్కనున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. నేడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది.   


పవన్ కళ్యాణ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించారు. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో పవన్ మూవీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అనౌన్సమెంట్ పోస్టర్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. కొన్ని ఫజిల్స్ తో ఎక్కడలేని ఆసక్తి రేపుతోంది. పవన్ ఒక నగరం వైపు తీక్షణంగా చూస్తున్నాడు. రైసింగ్/సెట్టింగ్ సన్ కనిపిస్తుంది. ఆయన నీడను గన్ గా చూపించారు. విదేశీ భాషలో ఏదో రాసి ఉంది. ఇక 'ఆయన్ని #OG అని పిలుస్తారు' అని చెప్పి మరింత ఆసక్తి పెంచేశారు. 

తమిళ హిట్ మూవీ తేరి రీమేక్ చేస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ అనౌన్స్మెంట్ పోస్టర్ చూస్తే ఇది స్ట్రెయిట్ మూవీలా ఉంది. అలాగే #OG అర్థం ఏమిటని ఫ్యాన్స్ సెర్చ్ చేస్తున్నారు. మొత్తంగా ప్రకటనతోనే ఎక్కడలేని అటెన్షన్ సినిమాకు వచ్చేసింది. పవన్-సుజీత్ కాంబోలో ఒక భారీ బ్లాక్ బస్టర్ ఖాయమనిపిస్తుంది. 

ఆర్ ఆర్ ఆర్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య నిర్మిస్తున్నారు.  రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇతర నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించాల్సి ఉంది. మరి ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడు మొదలయ్యేది చెప్పలేదు. ప్రస్తుతం పవన్ హరి హర వీరమల్లు షూట్ లో పాల్గొంటున్నారు. హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ చిత్రాన్ని ప్రకటించి ఉన్నారు. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్-సుజీత్ చిత్రాల్లో దేన్ని ముందు సెట్స్ పైకి తెస్తారో చూడాలి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?