అందాల బ్రిటిష్ తార అమీ జాక్సన్ ని సౌత్ ప్రేక్షకులు అంత త్వరగా మరచిపోలేరు. మతిపోగోట్టే సోయగాలు, క్యూట్ నటనతో ఆకట్టుకుంది. అమీ జాక్సన్ ఎవడు, 2.0, ఐ చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే.
అందాల బ్రిటిష్ తార అమీ జాక్సన్ ని సౌత్ ప్రేక్షకులు అంత త్వరగా మరచిపోలేరు. మతిపోగోట్టే సోయగాలు, క్యూట్ నటనతో ఆకట్టుకుంది. అమీ జాక్సన్ ఎవడు, 2.0, ఐ చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ సరసన శంకర్ దర్శకత్వంలో నటించిన 2.0 చిత్రమే అమీ జాక్సన్ చివరి చిత్రం.
ఆ తర్వాత జాక్సన్ మరే మూవీలోనూ నటించలేదు. అందుకు కారణం ఆమె తన ప్రియుడితో సహజీవనం మొదలు పెట్టడమే. లండన్ కు చెందిన వ్యాపారవేత్త జార్జ్ పనాయోటూతో అమీ జాక్సన్ ప్రేమలో పడింది. వీరిద్దరి సహజీవనం ప్రారంభించారు. 2019లో ఈ జంటకు ఓ కొడుకు కూడా జన్మించాడు.
కొంత కాలానికి అమీ జాక్సన్ జార్జ్ తో పెళ్లి కాకుండానే విడిపోయింది. కొన్ని రోజులు ఒంటరిగా ఉన్న ఈ మెరుపుతీగ.. ఆ తర్వాత కొత్త ప్రియుడిని వెతుక్కుంది. ప్రస్తుతం అమీ జాక్సన్ బ్రిటిష్ నటుడు ఎడ్ వెస్ట్వీక్ తో రిలేషన్ లో ఉంది. ఇదిలా ఉండగా అమీ జాక్సన్ బ్రిటిష్ మహిళ అయినప్పటికీ ఇండియాలో నటిగా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకుంది.
2010లో 1947 ఎ లవ్ స్టోరీ ( మద్రాసు పట్టణం) చిత్రంతో అమీ జాక్సన్ డెబ్యూ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆర్య సరసన ఎమోషనల్ గా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ఈ మెరుపు తీగకి అనేక అవకాశాలు వచ్చాయి. శంకర్ 2.0, ఐ చిత్రాల్లో నటించింది. రాంచరణ్ సరసన ఎవడులో మెరిసింది. నిన్న ఇండియా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమీ జాక్సన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
undefined
'హ్యాపీ ఇండిపెండెన్స్ డే, ఇంక్రెడిబుల్ ఇండియా.. నానా మొదటి చిత్రం మద్రాసు పట్టణంతో ఈ అందమైన దేశంలో తిరిగే అవకాశం లభించింది. ఈ అవకాశం కల్పించిన దర్శకుడు ఏఎల్ విజయ్ కి జీవితాంతం రుణపడి ఉంటాను. ఆ రోజు నుంచి ఇండియా నా రెండవ ఇల్లు గా మారిపోయింది. అక్కడ నాకు ఏర్పడ్డ స్నేహితులు కుటుంబ సభ్యులుగా మారారు.
నేను ఒక వ్యక్తిగా మారడానికి ఇండియాలో ఎన్నో మధురమైన అనుభూతులు ఉన్నాయి. నిజంగా ఇండియా లాంటి ప్రదేశం ఇంకెక్కడా లేదు' అంటూ అమీ జాక్సన్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమీ జాక్సన్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట నెటిజన్ల హృదయాలు దొంచుకుంటున్నాయి. నీవు ఎప్పటికి మా దొరసానమ్మవే అంటూ నెటిజన్లు అమీ జాక్సన్ కి రిప్లై ఇస్తున్నారు. దొరసానమ్మ అనేది మద్రాసు పట్టణం చిత్రంలో అమీ జాక్సన్ పాత్ర పేరు.