క్షమాపణలు చెప్పినా కౌంటర్ వేసింది... రానా మీద మండిపడుతున్న సోనమ్!

Published : Aug 16, 2023, 02:37 PM IST
క్షమాపణలు చెప్పినా కౌంటర్ వేసింది... రానా మీద మండిపడుతున్న సోనమ్!

సారాంశం

  రానా క్షమాపణలు చెప్పినా సోనమ్ కపూర్ చల్లబట్టట్లు లేదు. ఆమె పరోక్షంగా రానాకు కౌంటర్ వేసింది. అలాంటి వ్యక్తులే మనుషుల గురించి మాట్లాడతారని ఓ కోట్ షేర్ చేసింది.    

కింగ్ ఆఫ్ కొత్త ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో రానా చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. ఆయన సోనమ్ కపూర్ కి క్రమశిక్షణ లేదన్నట్లు మాట్లాడారు. అయితే రానా క్షమాపణలు చెప్పినా సోనమ్ కపూర్ చల్లబట్టట్లు లేదు. ఆమె పరోక్షంగా రానాకు కౌంటర్ వేసింది. అలాంటి వ్యక్తులే మనుషుల గురించి మాట్లాడతారని ఓ కోట్ షేర్ చేసింది. 'సంకుచిత మనస్తత్వం కలవారు ఇతరుల గురించి మాట్లాడతారు. సాధారణ మనుషులు సంఘటనల గురించి మాట్లాడతారు. మేధావులు మాత్రమే నూతన ఆలోచన గురించి చర్చించుకుంటారు' అని ప్రముఖ అమెరికన్ యాక్టివిస్ట్ ఎలినార్ రూజ్వెల్ట్ చెప్పిన కోట్ షేర్ చేసింది. 

ఈ పోస్ట్ ద్వారా హీరో రానాకు సోనమ్ కౌంటర్ వేశారని పలువురు భావిస్తున్నారు. తన గురించి తప్పుగా మాట్లాడిన రానాను ఆమె సంకుచిత మనస్తత్వం కలిగిన వ్యక్తిగా అభివర్ణించారని అంటున్నారు. అసలు వివాదం ఏంటంటే... దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ మూవీ కింగ్ ఆఫ్ కొత్త ఆగష్టు 24న విడుదల కానుంది. దీంతో హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.  అతిథిగా రానా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ... దుల్కర్ చాలా సహనపరుడు. ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. అలాంటి దుల్కర్ వైల్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయడమంటే నాకు ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంది. గతంలో దుల్కర్ సల్మాన్ చేసిన ఓ బాలీవుడ్ మూవీ నిర్మాతలు నా ఫ్రెండ్స్. ఆ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంటే నేను సెట్స్ కి వెళ్ళాను. ఆ చిత్రంలో నటిస్తున్న ఓ బాలీవుడ్ బడా హీరోయిన్ షాపింగ్ గురించి భర్తతో ఫోన్లో మాట్లాడుతూ దుల్కర్ ని వెయిట్ చేయించింది. 

టేకుల మీద టేకులు తీసుకుంటూ మధ్యలో ఫోన్స్ మాట్లాడుతున్నా దుల్కర్ ఎండలో సహనంగా ఎదురు చూశాడు. చివరికి నా సహనం కూడా నటించింది. దుల్కర్ మాత్రం కామ్ గా ఉన్నారని చెప్పుకొచ్చాడు. రానా కామెంట్స్ తో సోనమ్ కపూర్ ట్రోల్స్ కి గురైంది. స్టార్ కిడ్ కావడంతో ఆమెకు పొగరంటూ కొందరు టార్గెట్ చేశారు. తన వ్యాఖ్యల కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్న సోనమ్ కపూర్ కి రానా క్షమాపణలు చెప్పారు. 

సోనమ్ నాకు ఫ్రెండ్. ఇద్దరం సరదాగా మాట్లాడుకుంటాం. నా కామెంట్స్ తప్పుగా ప్రోజెక్ట్ అయ్యాయి. దాంతో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. నా వ్యాఖ్యల ఉద్దేశం అది కాదు. ఇప్పటికైనా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టండి. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు అని కామెంట్ చేశారు. రానా బహిరంగంగా క్షమాపణలు చెప్పినా సోనమ్ కోపం తగ్గినట్లు లేదు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా