ప్రెగ్నెన్సీ వల్ల RRR ఛాన్స్ మిస్!

By Prashanth MFirst Published Apr 16, 2019, 8:15 PM IST
Highlights

. 2.0 సినిమా హిట్టయ్యేవుంటే ఆమె రేంజ్ మరో లెవెల్లో ఉండేదేమో..? ఆ సంగతి పక్కనపెడితే.. పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో అదే పనిగా ఫొటోలు పెడుతూ వస్తోంది. 

ఇంగ్లీష్ బ్యూటీ అమీ జాక్సన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మంచి టాలెంట్ తో బాగానే రాణించింది. మొదట్లో చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా అన్ని సినిమాలు చేసిన ఈ బ్రిటిష్ పిల్ల ఎంతో ఓపిగ్గా కెరీర్ ను నిలబెట్టుకుంది. 2.0 సినిమా హిట్టయ్యేవుంటే ఆమె రేంజ్ మరో లెవెల్లో ఉండేదేమో.. 

ఆ సంగతి పక్కనపెడితే.. పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో అదే పనిగా ఫొటోలు పెడుతూ వస్తోంది. ఇక మొదట్లో RRR సినిమాకు ఈ బేబీని ఎంచుకోవాలని చిత్ర యూనిట్ ఆలోచించినట్లు సమాచారం. విదేశీ అమ్మాయి పాత్ర కోసం జక్కన్న నేషనల్ వైడ్ పాపులర్ అయిన నటిని సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నారు. 

కానీ అమీ ప్రెగ్నెన్సీ న్యూస్ బయటపడటంతో ఆమె గురించి మర్చిపోయారు. ఫైనల్ గా అమీ జాక్సన్ ఇప్పట్లో నటించే అవకాశం లేదని తెలుస్తోంది. బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలనీ అమీ డిసైడ్ అయినట్లు టాక్. 

click me!