పుకారు పుచ్చిపోయాక పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన పూనమ్!

Published : Apr 16, 2019, 06:10 PM ISTUpdated : Apr 16, 2019, 06:13 PM IST
పుకారు పుచ్చిపోయాక పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన పూనమ్!

సారాంశం

ఎలక్షన్స్ కి ముందు  ఆమె పై ఎన్ని కథనాలు వచ్చినా స్పందించని పూనమ్ ఎన్నికల అనంతరం సోషల్ మీడియాలో తన పరువు తీస్తున్నారని పోలీస్ స్టేషన్  మెట్లెక్కింది. 

పూనమ్ కౌర్ కి సంబందించిన వార్తలు గత కొంత కాలంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పేరును కూడా ఇరికించిన విషయం విదితమే. అయితే ఎలక్షన్స్ కి ముందు  ఆమె పై ఎన్ని కథనాలు వచ్చినా స్పందించని పూనమ్ ఎన్నికల అనంతరం సోషల్ మీడియాలో తన పరువు తీస్తున్నారని పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. 

తన పేరును ప్రస్తావిస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారని ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. అదే విధంగా తనను మానసికంగా వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్ పై నెగిటివ్ కామెంట్స్ చేయకున్నా ఎదో రకంగా పవన్ ప్రస్తావన తెస్తూ సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేసిన పూనమ్ తెలియకుండానే వైరల్ అయ్యింది. 

ఇక ఎలక్షన్ దగ్గరపడుతున్న సమయంలో పవన్ గురించి ఆమె ఫోన్ లో మాట్లాడినట్లు కొందరు ఒక ఆడియో టేప్ ను సృష్టించడం అందరికి తెలిసిందే. ఆ వీడియో ఫెక్ అని అందరికి తెలిసినా పూనమ్ పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. ఇక పవన్ పై నెగిటివ్ కామెంట్ చేస్తూ ఇతరులు ఆమె పేరు ప్రస్తావించినా స్పందించలేదు. 

పుకార్లు పుట్టి నెలలు గడిచింది. పుచ్చిపోయి అందరూ మరచిపోయాక ఆమె కేసు వేయడం గమనార్హం. అయితే ఫైనల్ గా ఇప్పుడు పూనమ్ ఎన్నికల ముందు అసత్య ప్రచారాలు చేసినందుకు కేసు వేసిందా? లేక ప్రస్తుతం ఆమెను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నందుకు పోలీసులను ఆశ్రయించిందా? అనే విషయం తెలియాల్సి ఉంది. 

 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?