
ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ ...నితిన్ పై మండిపడ్డారు. అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ వేడుకకి హీరోనితిన్‌కి గైర్హాజరు కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన తాజాగా "హై 5" అనే ఒక సినిమాకి దర్శకత్వం వహించారు. తానే స్వయంగా నిర్మించిన ఈ చిత్ర ఈవెంట్ కి హీరో నితిన్ ను గెస్ట్ గా పిలిచారు కానీ నితిన్ రాలేకపోవడంతో ఆ వేడుకలో మాట్లాడుతూ అమ్మ రాజశేఖర్ ....నితిన్ ని ఉద్దేశించి ఆవేశంగా మాట్లాడారు.
అమ్మరాజశేఖర్ మాట్లాడుతూ... "ఒకానొక సమయంలో నితిన్ కి అసలు ఎలా డాన్స్ చేయాలి అనేది కూడా తెలియదు. కానీ మొదటి నుంచి నేను నేర్పించాను. నన్ను గురువుగా భావించి గౌరవిస్తాడని అనుకున్నాను కానీ ఇవాళ ఈవెంట్ కి పిలిచినా రాలేదు," అని అన్నారు రాజశేఖర్. "హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాక నితిన్ నన్ను ఇవాళ అవమానించాడు. తనకి ఇవాళ షూటింగ్స్ కూడా ఏమీ లేవు. కేవలం ఇంట్లో కూర్చున్నాడు. నీ గురువుని నువ్వు మర్చిపోతే నువ్వు ఎప్పటికీ సూపర్ స్టార్ వి కాలేదు.
పది రోజుల క్రితమే నితిన్‌ను ఈ ప్రోగ్రామ్‌కు రావాల్సిందిగా ఆహ్వానించా. ఆయన వస్తానని మాట కూడా ఇచ్చారు. ఆ మాట నమ్మి.. అన్నం కూడా తినకుండా కష్టపడి నితిన్ కోసం ప్రత్యేకంగా ఏవీ క్రియేట్ చేయించా. నితిన్‌కు అసలు డ్యాన్సే రాదు. ఆయనకు డ్యాన్స్ నేర్పించి, ఓ గుర్తింపు వచ్చేలా చేసిన గురువులాంటి నాపై గౌరవంతో వస్తారని భావించా. కానీ, ఆయన ఇంట్లో ఉండి కూడా ఇక్కడికి రాలేదు. ఫోన్ చేస్తే జ్వరమని చెప్పాడు. దానికి నేను వీడియో బైట్ అయినా పంపమని కోరాను. అది కూడా ఇవ్వలేదు.
టెక్నీషియన్ విత్తనాలు అయితే ఆర్టిస్టులు ఫలాలు లాంటి వాళ్ళు. విత్తనాలే వృక్షాలు అయ్యి మంచి ఫలాలను ఇస్తాయి. నువ్వు నాకు ఒక అబద్ధపు ప్రమాణం చేశావు. ఒరేయ్ నితిన్ నీ విషయంలో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. నిన్ను నేను నమ్మాను. లైఫ్ లో నిన్ను ఎప్పుడైనా కలిస్తే మళ్ళీ అప్పుడు చూద్దాం," అని నితిన్ పై మండిపడ్డారు.
అయితే మరోవైపు సినిమా ట్రైలర్ చూసిన నితిన్ అభిమానులు మాత్రం...నువ్వేమన్నా నితిన్ పెద్ద హిట్ ఇచ్చావా...ఓ డిజాస్టర్ సినిమా టక్కరి చేసావు అంటున్నారు. అలాగే "హై 5" అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న సినిమా కాబట్టే నితిన్ అలాంటి సినిమాని ప్రమోట్ చేయడం ఇష్టం లేక వేడుకకి రాలేదని చెబుతున్నారు.