హారికని కిందపడేసి.. జేబులో చేయిపెట్టి..రచ్చరచ్చ చేసిన అమ్మా రాజశేఖర్‌

Published : Oct 28, 2020, 11:31 PM IST
హారికని కిందపడేసి.. జేబులో చేయిపెట్టి..రచ్చరచ్చ చేసిన అమ్మా రాజశేఖర్‌

సారాంశం

అమ్మా రాజశేఖర్‌ నుంచి చాక్లెట్లు తీసుకుని తన జేబులో వేసుకుని పారిపోయింది. ఆమె విషయంలో కేర్‌ టేకర్‌ అయిన మోనాల్‌కి ఫిర్యాదు చేశాడు అమ్మారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది.

హారికా, అమ్మా రాజశేఖర్‌ల మధ్య చాక్లెట్ల విషయంలో పెద్ద గొడవ జరిగింది. చాకెట్లని హారిక దొంగతనం చేసింది. అమ్మా రాజశేఖర్ డైపర్ వేసుకుని దాగుడు మూతలు ఆడుతూ తోటి పిల్లల్ని ఎంటర్ టైన్ చేశారు. హారిక, మెహబూబ్, అవినాష్, అరియానాలు మాస్టర్‌ని బాగా ఆటపట్టించారు. హారిక కూడా షాట్‌ వేసుకుని కొంటెగా ప్రవర్తించింది. ఛాన్స్ దొరికిందే అదనుగా భావించి రెచ్చిపోయి కొంటె పనులు చేసింది. 

అమ్మా రాజశేఖర్‌ నుంచి చాక్లెట్లు తీసుకుని తన జేబులో వేసుకుని పారిపోయింది. ఆమె విషయంలో కేర్‌ టేకర్‌ అయిన మోనాల్‌కి ఫిర్యాదు చేశాడు అమ్మారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. మరోవైపు తన చాక్లెట్లు తీసుకున్న హారికని పట్టుకుని గుంజుకోవాలని అమ్మా భావించారు. ఆమెను పరిగెత్తించి పట్టుకుని  కింద పడేసి మరీ చాక్లెట్లు గుంజుకున్నారు. హారిక మాస్టర్.. మాస్టర్‌ అని అరుస్తున్నా ఆమె జేబులో చేయిపెట్టి మరీ లాక్కున్నాడు. 

ఆమె నుంచి చాక్లెట్లు తీసుకుని మరీ ఆమెపై ఫైర్‌ అయ్యాడు. `ఇది టూ మచ్ హారికా.. సైకో.. ` మండిపడ్డాడు. `నేను ఆడను` అంటూ ముఖం మార్చుకున్నాడు.  హారిక.. ఒక మహిళ అయి ఉండి, నా జేబులో చేయిపెట్టి చాక్లెట్లు లాక్కుంటే తప్పుకాదు.. నేను తిరిగి అలాగే తీసుకుంటే తప్పు అంటున్నారు.. లేడీస్ లేడీస్ అని అరుస్తున్నారెందుకు ?` అంటూ అభి దగ్గర వాపోయాడు మాస్టర్‌. ఆటలో అమ్మాయిలు, అబ్బాయిలు ఏంటి?? అంటూ సీరియస్ అయ్యారు రాజ శేఖర్ మాస్టర్.

ఆయన పాకెట్‌ నాకు అనుకూలంగా ఉంది తీసేశా.. కానీ నా పాకెట్లో చేయి పెట్టొద్దని నేనేం చెప్పలేదు అంటూ లాస్య, మోనాల్‌లతో వాదించింది హారిక. ఇది నా స్ట్రాటజీ నా ఆట నా ఇష్టం.. దొంగతనం చేయొచ్చని బిగ్ బాస్ చెప్పారు అంటూ తనని తాను సమర్ధించుకుంది హారిక. మొత్తానికి ఈ చాక్లెట్ల గొడవ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?