బిగ్‌బాస్‌3 ఫేమ్‌ పునర్నవి సర్‌ప్రైజ్‌.. మ్యారేజ్‌ ఫిక్స్

Published : Oct 28, 2020, 09:43 PM ISTUpdated : Oct 28, 2020, 10:20 PM IST
బిగ్‌బాస్‌3 ఫేమ్‌ పునర్నవి సర్‌ప్రైజ్‌.. మ్యారేజ్‌ ఫిక్స్

సారాంశం

తెలుగు హీరోయిన్‌, బిగ్‌బాస్‌3 ఫేమ్‌ పునర్నవి భూపాలం పెళ్ళి ఫిక్స్ అయ్యింది. ఫైనల్‌గా తాను మ్యారేజ్‌ చేసుకోబోతున్నట్టు వెల్లడించింది. ఈ సందర్బంగా రింగ్‌ తొడుకున్న ఫోటోని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుని తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.  

తెలుగు నటి‌, బిగ్‌బాస్‌3 ఫేమ్‌ పునర్నవి భూపాలం పెళ్ళి ఫిక్స్ అయ్యింది. ఫైనల్‌గా తాను మ్యారేజ్‌ చేసుకోబోతున్నట్టు వెల్లడించింది. ఈ సందర్బంగా రింగ్‌ తొడుకున్న ఫోటోని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుని తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. 

ఇప్పటికే ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్టు చెప్పకనే చెప్పింది. పునర్నవి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ, `మొత్తానికి ఇది జరిగింది` అని పేర్కొంది. ఈ సందర్భంగా ఓ ఫోటోని పంచుకుంది. ఇందులో తన చేయిని మరో చేయి పట్టుకుని ఉంది. అందులో పునర్నవి వేలికి రింగ్‌ తొడిగి ఉంది. అయితే తాను చేసుకోబోయే వ్యక్తి ఎవరనేమాత్రం వెల్లడించలేదు. 

ఇదిలా ఉంటే `బిగ్‌బాస్‌3` టైమ్‌లో పునర్నవికి, సీజన్‌ విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ మధ్య లవ్‌ ట్రాక్‌ జరిగింది. వీరిద్దరు మ్యారేజ్‌ చేసుకోబోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి.  పలు ఇంటర్వ్యూల్లో వీరిద్దరికీ ఇదే ప్రశ్న ఎదురైంది. కానీ ఇద్దరూ అలాంటిదేమీ లేదని, తాము స్నేహితులమని చెబుతూ వచ్చారు. ఇప్పుడు పునర్నవి ఏకంగా తన పెళ్ళిని ప్రకటించేసింది. మరి వరుడు ఎవరు? ఆమె ఎవర్ని మ్యారేజ్‌ చేసుకోబోతున్నందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. 

పునర్నవి భూపాలం `ఉయ్యాలా జంపాలా`, `మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు`, `పిట్టగోడ`, `మనసుకు నచ్చింది`, `ఎందుకు ఏమో`, `ఒక చిన్న విరామం`, `సైకిల్‌` చిత్రాల్లో నటించింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌